Templates by BIGtheme NET
Home >> Cinema News >> సిస్టర్స్ తో టింగురంగడిలా ఫోజిచ్చాడు

సిస్టర్స్ తో టింగురంగడిలా ఫోజిచ్చాడు

Kareena-Kapoor-celebrates-her-Saif-Ali-Khan-Birth-day

Kareena-Kapoor-celebrates-her-Saif-Ali-Khan-Birth-day

బిడ్డొచ్చే వేళా విశేషమిది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఖాన్ 50వ బర్త్ డే వేడుకలు ముంబైలో వైభవంగా జరుపుకున్నారు. ఇంట్లో భర్త సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోల్ని కరీనా కపూర్ స్వయంగా సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. ప్రతిసారీ బర్త్ డే వేరు. ఈసారి బర్త్ డే వేరు.

ఈ వేడుకల్లో సైఫీనా జంట ఒక గొప్ప శుభవార్తను అందించింది. ఈ జంట తమ రెండవ బిడ్డను సాధ్యమైనంత త్వరలోనే ఆశిస్తున్నారు. కేక్ కటింగ్ వేడుకలో ఒకరినొకరు ముద్దు పెట్టుకుని ఆప్యాయతల్ని కబరుచుకున్నారు. సైఫ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. కరీనా రెండు వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

జీవితంలో ఎప్పటికీ మరుపురాని ముఖ్యమైన పుట్టినరోజు ఇది అంటూ బెబో ఎమోషన్ కి గురైంది. ఇక ఈ వేడుక ఆద్యంతం సైఫ్ తో ఫోటోలకు ఫోజులివ్వడంలో బెబో సోదరి కరిష్మాకపూర్ ఎంతో ఆత్రాన్ని కనబరచడం కెమెరా కంట పడింది. సైఫ్ కి కరిష్మా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే పరిశ్రమ స్నేహితులు .. అభిమానుల స్పందనలతో సోషల్ మీడియాల్లో హోరెత్తిపోయింది.

ఇదే వేడుకలో భర్త కునాల్ కీముతో సైఫ్ సోదరి సోహా అలీఖాన్ ప్రత్యక్షమైంది. కరిష్మా కపూర్ కుమార్తె సమీరాతో పాటు కనిపించగా.. భర్త షకీల్ లడక్ తో కలిసి అమృత అరోరా ప్రత్యక్షమైంది. ఈ ఆదివారం తో 50 ఏళ్లు నిండినందున సైఫ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Share via
Copy link