Templates by BIGtheme NET
Home >> Cinema News >> మోసపోయానన్న చందమామ కాజల్

మోసపోయానన్న చందమామ కాజల్

చందమామ కాజల్ మోసపోయారా? అంటే అవునని తనే అంగీకరించారు. తాను కూడా పలు సందర్భంలో ఆన్ లైన్ మోసానికి గురయ్యానని డబ్బు పోయిందని తాజాగా కాజల్ వెల్లడించారు.

సైబర్ మోసగాళ్ల కథాంశంతో రూపొందుతున్న మోసగాళ్లు ప్రమోషన్స్ లో పాల్గొన్న కాజల్ తాను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న ఓ మోసం గురించి బహిరంగంగా వెల్లడించారు. ఒకటికి రెండు సార్లు ఆన్ లైన్ లో మోసాన్ని ఎదుర్కోవాల్సొచ్చిందని కాజల్ వెల్లడించారు.

ముంబై మురికివాడల్లో నివశించే అక్కా (కాజల్)- తమ్ముడు (విష్ణు) ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా.. దేశం షాక్ తినేలా 2600 కోట్ల స్కామ్ ని ఎలా చేశారు? అన్నదే మోసగాళ్లు సినిమా థీమ్. ఇందులో కాజల్ – విష్ణు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించారు. తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగానే అక్కా తమ్ముళ్లు అతి పెద్ద స్కామ్ చేయడం ఇందులో మరో ఆసక్తికర ఎలిమెంట్. స్కామ్ కి పాల్పడిన వ్యక్తులు ఇప్పటికీ ముంబైలో నివశించి ఉన్నారని వారితో మంతనాలు సాగించాక ఆ పాత్రల్లో నటించామని విష్ణు ఇదివరకూ వెల్లడించారు. ఈనెల 19న సినిమా థియేటర్లలోకి వస్తోంది. మంచు మోహన్ బాబు – రానా అతిథులుగా ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.

Share via
Copy link