Templates by BIGtheme NET
Home >> Cinema News >> దమ్ము కొడుతున్న కాజల్ ఫోటో లీక్

దమ్ము కొడుతున్న కాజల్ ఫోటో లీక్

అందాల కాజల్ ఇమేజ్ కి పూర్తి భిన్నమైన యాక్టివిటీ ఇది. అలా పబ్లిక్ లో దమ్ము కొడుతూ కనిపించింది. పొగ రాయుడిలా గుప్పు గుప్పుమని పొగ వదులుతూ ఆ ఫోజు చూస్తే మరీ రెబల్ గా కనిపిస్తోంది. ఇంతకీ ఇది రియలా.. తెరపై ఫోజులా? అన్నది ఆరా తీస్తే.. ఇదంతా లైవ్ టెలీకాస్ట్ అనే వెబ్ సిరీస్ స్టింట్ అని తెలిసింది.

ఇటీవల స్ట్రిమింగుకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో కాజల్ దెయ్యం పాత్రలో ఝడిపించేస్తోంది. నిజానికి పారా నార్మల్ యాక్టివిటీస్ ని చిత్రీకరించడానికి వెళ్లే టీవీ హోస్ట్ గా కాజల్ ఇందులో కనిపించింది. కానీ ఇలా సిగరెట్ కొడుతూ కనిపించడం షాక్ కి గురి చేసింది. ఎంత వెబ్ సిరీస్ అయినా మిత్రవింద ఇలా చేయడం సరికాదని అభిమానులు విమర్శిస్తున్నారు. తమ ఫేవరెట్ స్టార్ తప్పు దారి పట్టిస్తోందన్న ఆవేదనా వ్యక్తమవుతోంది.

ఇక పై ఓటీటీలకు సెల్ఫ్ సెన్సార్ అవసరం అని కూడా వాదిస్తున్నారు.కాజల్ మరోవైపు మారుతి దర్శకత్వంలో 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలోనూ నటిస్తోంది.

Share via
Copy link