Templates by BIGtheme NET
Home >> Cinema News >> జూనియర్ కత్రీనా బిజీ బిజీ

జూనియర్ కత్రీనా బిజీ బిజీ

టాలీవుడ్ హీరో నితిన్ నటించిన గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ ఇషా తల్వార్ గుర్తుంది కదా. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినా కూడా పెద్దగా ఇక్కడ గుర్తింపు రాలేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి కొన్నాళ్లే అయినా కూడా అప్పుడే ఈ అమ్మడు పలు భాషల్లో నటించింది. మోడలింగ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె నిర్మాత నినోద్ తల్వార్ కూతురు అనే విషయం తెల్సిందే. ఈమద్య కాలంలో ఈమె హిందీలో హీరోయిన్ గా బిజీ అయ్యింది. జూనియర్ కత్రీనా అంటూ పేరు దక్కించుకున్న ఈమెకు మంచి పేరు వచ్చింది.

ఈమె చేస్తున్న ప్రతి సినిమాలో కూడా యాక్టింగ్ తో పాటు అన్ని విధాలుగా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో వస్తున్న ఆఫర్లను కాదనుకుండా చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. తెలుగులో ఈమె రాజా చేయి వేస్తే సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. పుట్టి పెరిగింది అంతా ముంబయిలోనే అయినా కూడా ఈ అమ్మడికి సౌత్ అమ్మాయిలా పోలికలు ఉండటంతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే కత్రీనా పోలికలు కూడా ఉంటాయని అంటున్నారు. అందుకే ఈ అమ్మడికి జూనియర్ కత్రీనా అంటూ పేరు వచ్చింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో మూడు సినిమాలతో ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

Share via
Copy link