Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఈ మహమ్మారి లోకల్ హీరోయిన్లకు హెల్ప్ అవుతోందా..??

ఈ మహమ్మారి లోకల్ హీరోయిన్లకు హెల్ప్ అవుతోందా..??

సినిమా ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతున్న నేపథ్యంలో ఎందరో సినీతారలు ఆర్టిస్టులు సినిమా షూటింగ్స్ నిలిచిపోయి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా అందరికి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మాత్రమే మంచి దారి అనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు సినిమా షూటింగ్స్ ఆగిపోయినా ఓటిటిలు మాత్రం విజయవంతంగా షూటింగ్స్ పూర్తి చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలం తెలుగు సినిమాల్లో పరభాషా నటినటులను ఎక్కువగా చూస్తున్నాం. ఏ సినిమా చూసినా ఖచ్చితంగా ఒక్క మెయిన్ రోల్ అయినా పరభాషా యాక్టర్స్ చేత చేయిస్తున్నారు తెలుగు దర్శకనిర్మాతలు. నిజానికి తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లకే అవకాశాలు లభించడం కష్టమైంది. అయితే ఇటీవలే వకీల్ సాబ్ విడుదలై మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.

అందులో ప్రధానపాత్రల్లో నటించిన తెలుగమ్మాయిలు అంజలి అనన్య. వీరిద్దరూ ఇప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా బిజీ అవుతున్నారు. నిజానికి లాక్డౌన్ అండ్ కరోనా కారణంగా ముంబై నుండి రావాల్సిన యాక్టర్స్ స్థానంలో ఇప్పుడు తెలుగు యాక్టర్లకు అవకాశాలు దొరుకుతున్నాయి. ఇటీవలే ఎఫ్3 సినిమాలో మూడో హీరోయిన్ గా ముంబై బ్యూటీ సోనాల్ చౌహన్ సెలెక్ట్ అయింది. కానీ ఇప్పుడు ఆమె ముంబైలో లాక్డౌన్ కారణంగా షూటింగ్ రాలేని పరిస్థితిలో ఉండటంతో ఆ క్యారెక్టర్ తెలుగు హీరోయిన్ అంజలికి వచ్చింది. ఇలా ఇప్పుడు లోకల్ హీరోయిన్స్ కూడా ఓటిటిలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు నుండి పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీని దేశవ్యాప్తంగా విస్తరించేలా చేస్తుండగా.. ఇప్పుడు ఇలా లోకల్ హీరోయిన్లకు ఛాన్స్ రావడం విశేషం నే చెప్పాలి.

Share via
Copy link