Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘శాకుంతలం’లో అరవింద కనిపించబోతుందా?

‘శాకుంతలం’లో అరవింద కనిపించబోతుందా?

గుణశేఖర్ దర్శకత్వంలో రానా హీరోగా హిరణ్యకశ్యప సినిమా రూపొందాల్సి ఉండగా కరోనా కారణంగా కాస్త ఆలస్యం కాబోతుంది. ఈ గ్యాప్ లో శాకుంతలం అనే సినిమాను తీయబోతున్నట్లుగా గుణశేఖర్ ప్రకటించాడు. ఒక విభిన్నమైన ప్రణయగాథగా ఈ సినిమాను గుణశేఖర్ రూపొందించబోతున్నాడు. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది మొదటి రెండు మూడు నెలల్లోనే ఈ సినిమాను పట్టాలెక్కించి స్పీడ్ గా చిత్రీకరణ జరపాలని భావిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన హీరోయిన్ గా ఎవరిని అనుకుంటున్నాడో కాని నెట్టింట మాత్రం ప్రచారం జోరుగా సాగుతోంది. పలువురు పేర్లు ప్రచారంకు వస్తున్నాయి.

శాకుంతలం సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. అరవింద సమేత సినిమా తర్వాత వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ఆసక్తిగా ఉన్నట్లుగా ఇటీవలే ఒక చిట్ చాట్ లో పేర్కొందట. దాంతో ఆమె గుణశేఖర్ మూవీలో నటించబోతుందనే ప్రచారం జరుగుతోంది.

ఆ విషయంలో గుణశేఖర్ కాని.. పూజా హెగ్డే కాని ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కనుక ఇవి పుకార్లే అని.. వాటిని పెద్దగా పట్టించుకోవడానికి లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని పూజా హెగ్డే అభిమానులు మాత్రం ఆమెను శాకుంతలంలో చూడాలని ఆశపడుతున్నామంటున్నారు. మరి వారి ఆశ నెరవేరేనా అనేది చూడాలి.

Share via
Copy link