Templates by BIGtheme NET
Home >> Cinema News >> షాకింగ్ః నాపై అత్యాచారం జరిగింది స్నేహితుడే చేశాడుః ప్రముఖ హీరోయిన్

షాకింగ్ః నాపై అత్యాచారం జరిగింది స్నేహితుడే చేశాడుః ప్రముఖ హీరోయిన్

సినీ పరిశ్రమలో తమ టాలెంట్ నిరూపించుకునేందుకు ఎంతో మంది ఆశతో వస్తున్నారని కానీ.. కొందరు వారి స్వేచ్ఛను హరిస్తున్నారని వారి ఆశలను మొగ్గలోనే తుంచేస్తూ.. దారుణాలకు పాల్పడుతున్నారని ప్రముఖ పాప్ సింగర్ డిస్నీ హాట్ స్టార్ నటి డెమి లోవాటో అన్నారు. అంతేకాదు.. తనపై కూడా అత్యాచారం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా పీపుల్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది డెమి. మార్చి 23న తన లేటెస్ట్ ఆల్బమ్ ‘డ్యాన్సింగ్ విత్ ది డెవిల్’ యూట్యూబ్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆమె ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు.

2018లో తనపై అఘాయిత్యం జరిగిందని వెల్లడించారు. అయినప్పటికీ.. తాను కుంగిపోకుండా మనోధైర్యంతో ముందుకు సాగానని తెలిపారు. ఓ రోజు రాత్రివేళ షూటింగ్ కు వెళ్లి వస్తున్న సమయంలో తనకు తెలియకుండా స్నేహితుడు డ్రగ్ ఇచ్చాడని దాని మోతాడు ఎక్కువైపోవడంతో తాను ప్రాణాపాయ స్థితిలోకి చేరుకున్నట్టు తెలిపారు డెమి. ఆ సమయంలో తనపై లైంగిక దాడి జరిగిందని వెల్లడించారు.

ఈ దారుణం తర్వాత తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని ఎంతగానో వేదనకు గురయ్యానని తెలిపారు. ఆ తర్వాత వాస్తవాన్ని అర్థం చేసుకొని మానసిక శక్తిని కూడదీసుకొని మళ్లీ కెరీర్ లో ముందుకు సాగానని వెల్లడించారు లోవాటో.

Share via
Copy link