Templates by BIGtheme NET
Home >> Cinema News >> చీరలో ఆరబోసి ఏమిటా ఫోజులు హంసా?

చీరలో ఆరబోసి ఏమిటా ఫోజులు హంసా?

పురుషులు ఏమి చేయగలరో అది చేయటానికి స్త్రీలను దేవుడు సృష్టిస్తాడు. పురుషులు చేయలేనిది చేయటానికి కూడా దేవుడు స్త్రీని సృష్టించాడు. కాబట్టి ఒత్తిడి ని వదిలేయాలి! అంటూ ఎంతో పాజిటివ్ గా స్పందించింది హంసా నందిని.

ఇటీవల సోషల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న హంసానందిని రెగ్యులర్ ఫోటోషూట్లను ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఇంతకుముందు మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు చిన్నారులతో కలిసి ఉన్న చిలిపి ఫోటోని షేర్ చేసింది హంస. అంతకుముందే కేరళ- మున్నార్ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా హంస పలు స్టోరీస్ కూడా చేసింది. స్వాన్ స్టోరీస్ పేరుతో ఈ అమ్మడు ఇటీవల ప్రతిదీ అభిమానులకు ఇన్ స్టా మాధ్యమంగా షేర్ చేస్తోంది. ఇదివరకూ వంటల కార్యక్రమాల్ని షేర్ చేయగా వైరల్ అయ్యాయి.

జీవితాన్ని సీరియస్ గా తీసుకోనివ్వండి..! అంటూ బిజీ బిజీగా కనిపిస్తోంది. అయితే ఇటీవల ఎందుకనో ఈ అమ్మడు టాలీవుడ్ కి పూర్తిగా దూరమైపోయింది. ఇక హంస లేటెస్ట్ ఫోటో సిరీస్ లో ఇదిగో ఇలా స్టైలిష్ గా రెడ్ హాట్ ఆర్గంజా శారీలో కనిపించింది. అలా స్టైలిష్ గా కళ్లకు ఉన్న త్రికోణ కళ్లద్దాలను సర్ధుకుంటూ ఫోజు కొట్టింది. పాక్షికంగా హంస అందాలు ఆ చీరలో కవ్విస్తుంటే యూత్ ఈ ఫోటోని అంతే వైరల్ గా షేర్ చేస్తున్నారు. అన్నట్టు టాలీవుడ్ నుంచి దూరమైన ఈ బ్యూటీ నటన విరమించుకున్నట్టేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు కొందరైతే. మరి ఈ భామ జవాబేమిటో?

Share via
Copy link