Templates by BIGtheme NET
Home >> Cinema News >> గోవా పార్టీ.. బాత్ టబ్ లో సన్నీ కిల్లర్ లుక్

గోవా పార్టీ.. బాత్ టబ్ లో సన్నీ కిల్లర్ లుక్

లాక్ డౌన్ లో అమెరికా వెళ్లి తన కుటుంబ సభ్యులకు సమయం కేటాయించిన సన్నీలియోన్ అత్త మామలకు సేవలు చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రశంసలు కురిసాయి. సన్నీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతిదీ సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. తాను నటించే తదుపరి సినిమాలు .. అలాగే తన ఇతర బిజినెస్ వ్యవహారాల గురించి.. వాణిజ్య ప్రకటనల వీడియోలను అభిమానులకు షేర్ చేస్తుంటుంది.

ఇటీవలే తన కొత్త సినిమాని ప్రకటించింది. పూజా కార్యక్రమాల్లో `క్లాప్బోర్డ్`తో ఉన్నప్పటి ఫోటోని షేర్ చేసింది. తన కొత్త సినిమా గురించి అభిమానులకు వివరాలు అందించింది. ప్రస్తుతం విక్రమ్ భట్ రూపొందిస్తున్న `అనామికా`లో నటిస్తోంది. ఇన్ స్టాలో ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ వీడియోల్ని సన్నీ షేర్ చేస్తుండగా అవన్నీ వైరల్ అవుతున్నాయి. సన్నీ లియోన్ ఇన్ స్టాగ్రామ్ వీడియోలు గంటలోపు 50వేల వీక్షణలను అందుకుంటున్నాయి. రోజుకు లక్షల్లో వీక్షణలతో దూసుకెళుతోంది.

తాజాగా సన్నీలియోన్ గోవా వెకేషన్ నుంచి అదిరిపోయే ఫోటోని షేర్ చేసింది. ఇందులో ఓ బాత్ టబ్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించింది. గ్రీన్ పర్పుల్ ఛమ్కీలతో డిజైనర్ డ్రెస్ లో సన్నీ లుక్ మతి చెడగొట్టింది. పచ్చ మెరుపులు ఛమ్మీల నడుమ సన్నీ అందాలు హీట్ పెంచాయి. గోవాలో ఈ లుక్ లవ్వబుల్ అని టీజ్ చేసింది సన్నీ. ప్రస్తుతం ఈ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది.

011 లో బిగ్ బాస్ తో పాపులరైన సన్నీలియోన్ అనంతరం సినీపరిశ్రమలోకి ప్రవేశించింది. రియాలిటీ షో తరువాత `జిస్మ్ 2` లో నటించింది. ఆ తర్వాత సినీకెరీర్ ఓ వెలుగు వెలిగింది. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటు స్పెషల్ పాటల్లోనూ డ్యాన్సులు చేసింది. జాక్ పాట్- హేట్ స్టోరీ 2- మస్తీ జాదే సహా పలు విజయవంతమైన చిత్రాలు కెరీర్ లో ఉన్నాయి. ఇటీవల తెలుగు- తమిళంలోనూ నటించింది. మంచు మనోజ్ సినిమాలోనూ స్పెషల్ రోల్ తో మెప్పించిన ఈ బ్యూటీ సౌత్ లో ఓ హిస్టారికల్ కాన్సెప్ట్ మూవీ `వీరమాదేవి`కి సంతకం చేయగా ఆ మూవీ పోస్టర్లు రిలీజైన సంగతి తెలిసినదే. 2018లో సినిమాని ప్రారంభిస్తే ఇప్పటివరకూ ఆ మూవీకి సంబంధించిన మరో అప్ డేట్ లేకపోవడంతో అది తెరకెక్కుతుందా లేదా? అన్న సందేహాలు ఏర్పడ్డాయి.

Share via
Copy link