Templates by BIGtheme NET
Home >> Cinema News >> షార్ట్ ఫిలింలో రెచ్చిపోయి నటించిన అనుపమ..!

షార్ట్ ఫిలింలో రెచ్చిపోయి నటించిన అనుపమ..!

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ సినిమాతో తెరంగ్రేటం చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘అ ఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అనుపమ.. ‘ప్రేమమ్’ ‘శతమానం భవతి’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘కృష్ణార్జున యుద్ధం’ ‘హలో గురూ ప్రేమ కోసమే’ ‘రాక్షసుడు’ వంటి సినిమాలలో నటించింది. ప్రస్తుతం నిఖిల్ తో కలిసి ’18 పేజెస్’ సినిమాలో నటిస్తోంది. తన అందంతో యువ హృదయాల్ని కొల్లగొట్టిన అనుపమ.. లేటెస్టుగా ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది. ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకున్న ఈ మలయాళ లఘు చిత్రానికి సంబంధించిన టీజర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

‘ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్’ షార్ట్ ఫిల్మ్ టీజర్ చూస్తుంటే ఇది భార్యాభర్తల మధ్య జరిగే స్టోరీ అని తెలుస్తోంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ – హక్కిం షాజహాన్ జంటగా నటించారు. నీకోసం ఏమైనా చేస్తానని హక్కిం అంటుండగా.. నాకోసం ఎవరినైనా చంపుతావా? అని అనుపమ అడుగుతుంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. సాంప్రదాయబద్ధంగా చీరకట్టులో ఉన్న అనుపమ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ షార్ట్ ఫిల్మ్ కోసం అను రెచ్చిపోయి నటించిందని అర్థం అవుతోంది. ఆర్ జే షాన్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించగా.. అఖిల్ మిధున్ నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ మలయాళ షార్ట్ ఫిల్మ్ ని తెలుగు కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇన్నాళ్లూ సినిమాలతో అలరించిన మలయాళ బ్యూటీ అనుపమ.. ఇప్పుడు షార్ట్ ఫిలింతో ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

Share via
Copy link