Templates by BIGtheme NET
Home >> Cinema News >> సంక్రాంతి బరిలో ‘ప్రభాస్ – పవన్’ల మధ్య పోరు తప్పదా..??

సంక్రాంతి బరిలో ‘ప్రభాస్ – పవన్’ల మధ్య పోరు తప్పదా..??

రానున్న సంక్రాంతి సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్ డార్లింగ్ ప్రభాస్ లు పోరుకు సిద్ధం అవుతున్నట్లే అనిపిస్తుంది. వీరిద్దరి మధ్య పోరు ఎందుకు అంటే అది సినిమాల పోరు కాదు. టీజర్ల పోరు. ఇప్పటికే వకీల్ సాబ్ టీజర్ సంక్రాంతికి రిలీజ్ అని కన్ఫర్మ్ అయింది. అలాగే రాధేశ్యామ్ టీజర్ కూడా వస్తుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాల పై సినీ అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఓవైపు అభిమానులు కూడా తమ అభిమాన హీరో మూవీ టీజర్ తో సోషల్ మీడియాలో రికార్డులు బద్దలుకొడతాం అంటూ రెడీగా ఉన్నారు. ఈ విధంగా చూస్తే వకీల్ సాబ్ రాధేశ్యామ్ ల మధ్య తగ్గ పోరు ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకూడదని అనుకుంటాం కానీ అభిమానుల అభిమానం అది అంతే.

ఇక ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ పాన్ ఇండియా సినిమా. అంటే దాదాపు ఐదు భాషలలో రాధేశ్యామ్ టీజర్లు విడుదల అవుతాయి. ఇది కాస్త ఈ హీరోల మధ్య పోరు తగ్గించే ఛాన్స్ ఉంది. కాబట్టి అన్ని బాషల ప్రేక్షకులు వకీల్ సాబ్ ను చూస్తారని చెప్పలేం. అలాగే రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ వకీల్ సాబ్ తెలుగు భాష వరకే పరిమితం. అందుకు వకీల్ సాబ్ టీజర్ రాధేశ్యామ్ తో పోటీకి దిగి రికార్డులు బ్రేక్ చేస్తుందని అనుకుంటే పొరపాటే. అలాగే చూసే ప్రేక్షకులు ఎలాగో రెండు టీజర్లను చూస్తారు. అప్పుడు పోరు కంటే ఎక్కువగా అభిమాన హీరోల టీజర్లు చూస్తూ ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు టీజర్లు రావడం తెలుగు అభిమానులకు సంక్రాంతి ట్రీట్ మాత్రం ఖాయం అనిపిస్తుంది. అనుకున్నట్లుగా ఒకేసారి ప్రభాస్ పవన్ కళ్యాణ్ ల టీజర్లు వస్తే మాత్రం ఆ హంగామా మాములుగా ఉండదు అనేది నిజం. చూడాలి మరి ఏం జరగనుందో..!

Share via
Copy link