Templates by BIGtheme NET
Home >> Cinema News >> భాయ్ ఓ ఇంటివాడైతే అంతేగా..!

భాయ్ ఓ ఇంటివాడైతే అంతేగా..!

ఆలిండియా బ్యాచిలర్ సంఘం అసోసియేన్ కి అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సి వస్తే సల్మాన్ భాయ్ కంటే బెటర్ ఆప్షన్ వేరొకటి లేదేమో!ఆ పేరే జాబితాలో పర్మినెంట్ గా వినిపిస్తుంది. భాయ్ నిత్య బ్రహ్మచర్యం నిరంతరం యువతుల్లో హాట్ టాపిక్. అతడు ఊ.. అనాలే కానీ వెంటనే పెళ్లాడేందుకు లక్షలాది మంది యువతులు వెయిటింగ్. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ భాయ్ మనసు మారదు. అతడు పెళ్లాడే ప్రసక్తే లేదు. ఇదిగో పులి అంటే అదుగో మేక! అంటూ తప్పించుకుంటాడు. అప్పుడప్పుడు ఫామ్ హౌస్ పార్టీలు తప్ప అసలు పెళ్లన్న ఊసే ఎత్తడు!! అదంతా సరే కానీ.. సల్మాన్ భాయ్ కే కనుక మూడ్ వచ్చి పెళ్లాడితే ఆ ఫ్యామిలీ ఎంత అందంగా ఉంటుందో ఓ అభిమాని ఎంతో అందంగా ఊహించి ఇదిగో ఇలా ఫోటో రూపంలో డిజైన్ చేశాడు. చూస్తుంటే ఎంత ముచ్చటేస్తోందో కదూ?

ఆ ఫోటోలో సల్మాన్ వైఫ్ గా దబంగ్ పెయిర్ సోనాక్షి సిన్హా యాప్ట్ గా కనిపిస్తోంది. ఆ ఇద్దరికి ఇంకో టు ప్లస్ వన్ ఆఫర్ లా కిడ్స్ ని కూడా జాయింట్ చేశారు. ముగ్గురు పిల్లా పాపలతో సల్మాన్ భాయ్ హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తే చూడాలని పాపం సదరు అభిమాని అదే పనిగా ఇప్పటికే వందలాది ఫోటోల్ని డిజైన్ చేసి ఇలా ఇన్ స్టాలో కలలుగంటున్నాడు. ఆ కలలన్నీ కల్లలైపోకుండా..ఎప్పటికి నెరవేరుతాయో ఏమిటో!

అన్నట్టు సల్మాన్ భాయ్ కి 90లలోనే నిశ్చితార్థం అయ్యి పెళ్లాగిపోయిందన్న ప్రచారం ఉంది. కనీసం విదేశీ యాంకర్ కం మేకప్ ఆర్టిస్ట్ లులియా వాంటూర్ ని సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకున్నాడని.. స్నేహితురాలు కత్రిన కైఫ్ ని సీక్రెట్ గా పెళ్లాడాడని ప్రచారం ఉన్నా కానీ ఏదీ నిజం కాలేదు.. వెరీ బ్యాడ్ ఆర్ సో లక్కీ..!!

Share via
Copy link