Templates by BIGtheme NET
Home >> Cinema News >> అల్లు కిడ్స్ టీమ్ ని ఎప్పుడైనా చూశారా?

అల్లు కిడ్స్ టీమ్ ని ఎప్పుడైనా చూశారా?

అల్లు ఫ్యామిలీలో కిడ్స్ గ్యాంగ్ ని చూశారా? అల్లరల్లరిలో ఈ గ్యాంగ్ తర్వాతే. ఆటా పాటలతో పాటు అందరూ యూనిటీని ప్రదర్శిస్తున్న ఓ ఫోటో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ అవుతోంది.

వీళ్లంతా వైట్ షర్ట్ ధరించి ఆటలకు రెడీ అయినట్టే కనిపిస్తోంది. ఇక వెనక్కి తిరిగితే ఆ వైట్ షర్ట్ లపై వారి పేర్లు కూడా కనిపిస్తున్నాయి. అల్లు అయాన్.. అల్లు అర్హ.. అల్లు అనైక.. అంటూ పింక్ లెటర్స్ లో పేర్లను కూడా ముద్రించారు ఈ చొక్కాలపై. అంటే వీళ్లంతా క్రికెట్ ప్లేయర్లా.. లేక ఫుట్ బాల్ ప్లేయర్లా.. బేస్ బాల్ ఆటగాళ్లా అన్నది తెలియాలి మనకు.

చూడటానికి ఎంత సైలెంట్ గా కనిపిస్తున్నారో ఆటకు దిగితే అంతే వైలెంట్ అయ్యే గ్యాంగ్ నే తలపిస్తున్నారు. అన్నట్టు క్యూట్ అల్లు అర్హ ఈ టీమ్ లో ఏ ప్లేస్ లో ఆడుతుందో కానీ..! ఇక సందడే సందడి అన్నమాట. అప్పుడప్పుడు డాడీతో కలిసి షికార్లు అల్లరి వేషాలేనా.. ఆటల్లోనూ అర్హ స్పీడ్ గానే ఉంటుందన్నమాట. ఇక అన్నయ్యతో కజిన్స్ తో కలిసి ఆటలే ఆటలు ఆడుతుందని ఈ గ్యాంగ్ ని చూస్తే అర్థమవుతోంది. అల్లు బాస్ అరవింద్ తో పాటు.. అల్లు బాబి- అల్లు అర్జున్ – అల్లు శిరీష్ సోదరులకు.. స్నేహా అర్జున్ కు వీళ్లతోనే టైమ్ పాస్ అన్నమాట.

Share via
Copy link