Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఈషా రెబ్బా.. న్యూ లుక్ అదిరిందబ్బా..

ఈషా రెబ్బా.. న్యూ లుక్ అదిరిందబ్బా..

‘హాట్ డ్రెస్ లోనే కాదు.. ట్రెడిషనల్ లుక్ లోనూ నేను యమా క్యూట్’ అంటోంది టాలీవుడ్ స్వీటీ ఈషా రెబ్బా. ముక్కు పుడకతో ఉన్న ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు అందానికి దాసోహమైన ఫ్యాన్స్ ‘ఆహా.. వారెవ్వా’ అంటూ కితాబిస్తున్నారు. ‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది గ్లామర్ గాళ్ ఈషా రెబ్బా. తర్వాత ‘బందిపోటు అమీతుమీ’ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టింది. వీటి తర్వాత నాని నిర్మాణంలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘అ’ మూవీలోనూ ఈ అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఎన్టీఆర్ ‘అరవింద సమేత’లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసింది.

అయితే.. అందం అభినం కలగలిసిన ఈ భామకు సరైన సినిమా పడలేదు. ఒక్క బ్లాక్ బస్టర్ ఖాతాలో పడిందంటే.. ఈ తెలుగు సోయగం ఎక్కడికో దూసుకెళ్తుంది. ట్రెడిషనల్ లుక్స్తో అదరగొడుతున్న ఈ బ్యూటీకి అద్భుతమైన ఆఫర్లు రావాలని ఆశిద్దాం.

Share via
Copy link