Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘శృంగారానికి ప్రైజ్ ట్యాగ్ పెట్టవద్దు’

‘శృంగారానికి ప్రైజ్ ట్యాగ్ పెట్టవద్దు’

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈ మధ్య ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. తనకు సంబంధంలేని విషయాల్లో కూడా తలదురుస్తూ వివాదాలు కొని తెచ్చుకుంటోంది. ఈ క్రమంలో ఆమెపై అనేక కేసులు కూడా ఫైల్ అయ్యాయి. నెపోటిజం అంటూ బాలీవుడ్ పైన విమర్శలు చేసిన కంగనా.. మెల్లిగా మహారాష్ట్రలోని శివసేన ప్రభుత్వంపైకి మళ్లించింది. ముంబై ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చడంతో ప్రారంభమైన కంగనా – శివసేన మధ్య యుద్ధం.. ఆమె ఆఫీస్ ని కూల్చేసే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు కేంద్రం వై ప్లస్ సెక్యూరిటీ కల్పించడం.. కంగనా కూడా పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తూ వస్తోంది. ఇటీవల రైతు ఉద్యమంపై కామెంట్స్ చేసి విమర్శలకు గురైంది. ఇప్పుడు లోకనాయకుడు మక్కల్ నీది మయ్యన్ పార్టీ అధినేత కమల్ హాసన్ పై కామెంట్స్ చేసింది కంగనా.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామని కమల్ హాసన్ ప్రకటించారు. దీనిని అభినందిస్తూ కాంగ్రెస్ నేత శశి థరూర్ ట్వీట్ చేశాడు. అయితే దీనికి రియాక్ట్ అయిన కంగనా ట్విటర్ వేదికగా కామెంట్స్ చేసింది. ”మాతృత్వం కోసం ప్రేమతో అందించే శృంగారానికి ప్రైజ్ ట్యాగ్ పెట్టవద్దు.. ఇల్లు అనే చిన్న రాజ్యానికి క్వీన్స్ అవడానికి మాకు జీతం అవసరం లేదు.. ప్రతిదీ వ్యాపార కోణంలో చూడటం మానుకోండి. ఇంటి యజమానురాలైన స్త్రీని తన ఇంటిలోనే ఉద్యోగిగా మార్చకండి. మాకు కావాల్సింది సాలరీ కాదు.. గౌరవం ప్రేమ. స్త్రీ తన ఇంట్లో చేసే పనికి డబ్బులు ఇవ్వాలనే మీ ఆలోచనను మార్చుకోండి” అంటూ కంగనా ట్వీట్ చేసింది.

Share via
Copy link