Templates by BIGtheme NET
Home >> Cinema News >> లారెన్స్ తమ్ముడితో ప్రాణహాని ఉంది : సినీ నటి

లారెన్స్ తమ్ముడితో ప్రాణహాని ఉంది : సినీ నటి

ప్రముఖ కొరియోగ్రాఫర్ దర్శకుడు రాఘవ లారెన్స్ సోదరుడు ఎల్విన్ అలియాస్ వినోద్తో తనకు ప్రాణభయం ఉందని వర్ధమాన సినీ నటి దివ్య(29) ఆరోపించింది. పోలీసులతో కుమ్మక్కైన ఎల్విన్.. తనను అంతమొందించాలని చూస్తున్నాడని పేర్కొంది. తాజాగా.. ఓ మీడియా సంస్థను ఆశ్రయించిన నటి దివ్య.. ఈ ఆరోపణలు చేసింది.

హైదరాబాద్ ఏసీపీ రవీందర్ రెడ్డితో ప్రత్యేక నెట్ వర్క్ ఏర్పాటు చేసుకొన్న ఎల్విన్.. తనను వేధిస్తున్నారని అన్నారు. ఈ విషయాన్ని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ dRష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది.

గతంలో ఎల్విన్ ఏసీపీ రవీందర్రెడ్డి తన జీవితాన్ని నాశనం చేశారని కూడా ఆరోపించింది దివ్య. ప్రేమ పేరుతో ఎల్విన్ వేధింపులకు గురిచేస్తే.. చర్యలు తీసుకోవాల్సిందిపోయి నాటి మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ ప్రస్తుత ఏసీపీ రవీందర్ రెడ్డి తనను వేధిస్తున్నారని ఆరోపించింది. ఎల్విన్తో కలిసి ఆరేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయింది.

తనను బ్రోతల్ కేసులో ఇరికించి 21 రోజులు జైల్లో ఉండేలా చేశారని కన్నీరు పెట్టుకుంది. ఎల్విన్ రవీందర్రెడ్డి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్కు వినతిపత్రం పంపినట్లు వెల్లడించింది దివ్య. ఈమె ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్సర్గా జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తోంది.

Share via
Copy link