Templates by BIGtheme NET
Home >> Cinema News >> 24 గంటల్లో రూ.కోటి రాబట్టిన ‘డర్టీ ’ చిత్రం..!

24 గంటల్లో రూ.కోటి రాబట్టిన ‘డర్టీ ’ చిత్రం..!

లేటెస్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజైన్ ‘డర్టీ హరి’ చిత్రం అంచనాలను మించిన వ్యూస్ తో భారీ కలెక్షన్లు సాధిస్తోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఊహించని స్పందన లభిస్తోందని మేకర్స్ చెబుతున్నారు. హాట్ హాట్ సీన్లతో యూత్ ఫుల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. డిజిటల్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. పే-ఫర్-వ్యూ మోడ్ ఆధారంగా ‘ఫ్రైడే మూవీస్’ అనే కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం టికెట్ ధర 120 రూపాయలుగా నిర్ణయించారు.

అయితే.. ఈ సినిమా ఓటీటీలో విడుదలైన 24 గంటల్లోనే 91818 వ్యూస్ సాదించిందని నిర్మాతలు ప్రకటించారు. కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రానికి ఈ స్థాయిలో వ్యూస్ రావడం గొప్ప విషయం అంటోంది యూనిట్.

కాగా.. 24 గంటల్లో 91818 వ్యూస్ వచ్చాయంటే.. ప్రతీ వ్యూకి రూ.120 చొప్పున మొత్తం రూ.1.10 కోట్లు వచ్చినట్టు లెక్క. ప్రస్తుతం వీకెండ్.. మరియు రాబోయే క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో ఈ చిత్రానికి వ్యూస్ మరింతగా పెరుగుతాయని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది. పైగా.. ప్రస్తుతం ఓటీటీలో చెప్పుకోదగ్గ కొత్త సినిమాలు ఏవీ లేవు. మరి సినిమా కలెక్షన్లు ఏ మేరకు పెరుగుతాయో చూడాలి.

Share via
Copy link