Templates by BIGtheme NET
Home >> Cinema News >> రానా వదిలిన ‘డియర్ మేఘ’ ఫస్ట్ లుక్..!

రానా వదిలిన ‘డియర్ మేఘ’ ఫస్ట్ లుక్..!

మేఘా ఆకాష్ – అరుణ్ ఆదిత్ – అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ”డియర్ మేఘ”. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ మరియు సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్ ఎ.సుశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని ఓ అందమైన ఆసక్తికరమైన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నాడు. ”డియర్ మేఘ” ఫస్ట్ లుక్ ను ఈ రోజు( గురువారం ఫిబ్రవరి 4 తేదీన) ఉదయం 9.01 నిమిషాలకు హీరో రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

‘డియర్ మేఘ’ ఫస్ట్ లుక్ పోస్టర్ లో మేఘ ఆకాష్ ఉద్వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఒక కంటిలో నుంచి కన్నీరు రావడం కనిపిస్తోంది. సినిమాలో మేఘా ఆకాష్ పాత్ర కీలకంగా ఉన్నట్లు కథను నడిపే డ్రైవింగ్ ఫోర్స్ గా ఆమె ఫర్మార్మెన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఆమె కన్నీటికి కారణం ఎవరు ఈ ఉద్వేగ పరిస్థితి ఎందుకొచ్చింది అనేది సినిమాలో తెలియనుంది. “డియర్ మేఘ” సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రానికి హరి గౌర సంగీతం సమకూరుస్తున్నారు. ఐ ఆండ్రూ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ‘డియర్ మేఘ’ ఫస్ట్ లుక్ సందర్భంగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ – హీరోలు రానా – విజయ్ సేతుపతి చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలియజేశారు.

Share via
Copy link