Templates by BIGtheme NET
Home >> Cinema News >> చిత్రపురి మాజీ అధ్యక్షుడి ఓటమి.. ఇంతకీ గెలిచిందెవరు?

చిత్రపురి మాజీ అధ్యక్షుడి ఓటమి.. ఇంతకీ గెలిచిందెవరు?

24 శాఖల సినీ కార్మికుల కోసం సొంత ఇంటి పథకం.. కాలనీని కట్టించిన ఘనత ఆసియాలోనే వేరే ఏ ఇండస్ట్రీకి లేదు. అలాంటి అరుదైన ఘనత టాలీవుడ్ కే సాధ్యమైంది. దివంగత సీనియర్ నటులు డా. ఎం. ప్రభాకర్రెడ్డి సినీ కార్మికులకు ఓ కాలనీ వుండాలని వారి సొంత ఇంటి కలని నిజం చేయడం కోసం ఆనాటి ప్రభుత్వాన్ని అభ్యర్థించి భూముల్ని రాసిచ్చారు. కాలనీ నిర్మాణానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో సినీ కార్మికుల చిరకాల స్వప్నమైన చిత్రపురి కాలనీ సాకారమైంది.

ఈ కాలనీకి కొమర వెంకటేష్ తొలి అధ్యక్షుడిగా పాలన మొదలు పెట్టి రెండు విడతలు కొనసాగారు. ఆయన తర్వాత తాత్కాలికంగా పరుచూరి వెంకటేశ్వరరావు అధ్యక్షులయ్యారు. రెండేళ్లుగా ఎన్నికలు వాయిదా పడగా.. గురువారం చిత్రపురి సొటైటీ ఎన్నికలు జరిగాయి. రసవత్తరంగా సాగిన ఈ ఎన్నికల్లో నటుడు వినోద్ బాలా ప్యానెల్ ఘన విజయం సాధించింది. ప్యానెల్ లో 11 మంది పోటీ చేస్తే అందులో 10 మంది అత్యధిక ఓట్లతో విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికల్లో వినోద్ బాలా ప్యానెల్ తో పాటు కొరమ వెంకటేష్ ప్యానెల్ – సి.కల్యాణ్ ప్యానెల్- ఓ. కల్యాణ్ ప్యానెల్ పోటీపడ్డాయి. సి. కల్యాణ్- ఓ. కల్యాణ్ ప్యానెల్ కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కపోగా.. మాజీ ప్రెసిడెంట్ కొమర వెంకటేష్ ప్యానెల్ నుంచి పోటీకి దిగిన 11 మందిలో కేవలం బత్తుల రఘు మాత్రమే విజయం సాధించారు.

మార్నేని వినోద్ బాలా ప్యానెల్ లో విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే..

*వల్లభనేని అనిల్కుమార్ పోలైన ఓట్లు 1271
* కాదంబరి కిరణ్కుమార్ పోలైన ఓట్లు 1257
* మహానందరెడ్డి పోలైన ఓట్లు 1038
* పీఎస్ ఎన్ దొర పోలైన ఓట్లు 929
* ప్రవీణ్కుమార్ యాదవ్ పోలైన ఓట్లు 779
* అళహరి పోలైన ఓట్లు 732
* కొంగర రామకృష్ణ ప్రసాద్ పోలైన ఓట్లు 720
* టి. లలిత పోలైన ఓట్లు 1112
* దీప్తీ వాజ్పేయి పోలైన ఓట్లు 1190
* అనిత నిమ్మగడ్డ పోలైన ఓట్లు 887
* రఘు బత్తుల పోలైన ఓట్లు 707 ( కొమర వెంకటేష్ ప్యానెల్)

Share via
Copy link