Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఫుల్ ట్రెండింగ్ లో మెగాస్టార్ – శర్వానంద్ యాడ్..!

ఫుల్ ట్రెండింగ్ లో మెగాస్టార్ – శర్వానంద్ యాడ్..!

వీళ్లిద్దరూ ఎప్పుడు యాడ్ లో నటించారని అనుకుంటున్నారా? నిజంగానే చిరు-శర్వా యాడ్ లో నటించారు. కానీ.. ఇప్పుడు కాదు. 17 సంవత్సరాల క్రితం! ఎప్పుడో మరుగున పడిపోయిన ఈ వాణిజ్య ప్రకటన.. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. సోషల్ మీడియాలో యమా డిస్కషన్ లో ఉంది. దీనికి ‘శ్రీకారం’ చుట్టింది ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి!

శర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతకు ముందు ఖమ్మం జిల్లాలో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శర్వాతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చిరు.

అప్పట్లో మెగాస్టార్.. థమ్స్ అప్ కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ కూల్ డ్రింక్ ప్రమోషన్ కోసం ఆయనతో పలురకాల యాడ్స్ షూట్ చేసేవారు. ఈ క్రమంలో ఓ యాడ్ కు ఒక కుర్రాడు అవసరం అయ్యాడు. దీంతో.. ఓ యువకున్ని సెలక్ట్ చేసి యాడ్ కంప్లీట్ చేశారు. అతనెవరో కాదు.. మన శర్వానంద్.

ఈ విషయాన్ని శ్రీకారం ఈవెంట్లో బయటపెట్టారు చిరు. ‘అప్పట్లో నేను చేయాల్సిన థమ్సప్ యాడ్ కోసం ఓ కొత్త కుర్రాడిని వెతుకున్నారు. ఆ సమయంలో మా ఇంట్లోనే ఉన్న శర్వానంద్ ను నటిస్తావా? అని అడగ్గా.. వెంటనే ఓకే చెప్పాడు. అలా మేమిద్దరం కలిసి థమ్సప్ యాడ్ పూర్తిచేశా’ అని చెప్పారు చిరు.

ఇంకేముందీ..? ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ కావడంతో.. అందరూ ఆ యాడ్ ఎలా ఉందంటూ వెతకడం మొదలు పెట్టారు. ఫలితంగా.. ఎక్కడో అడుగున పడిపోయిన యాడ్.. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆ విధంగా ఇటు థమ్సప్ కంపెనీకి కూడా అదనపు బెనిఫిట్ వచ్చేసింది. ఎప్పుడో పెట్టిన పెట్టుబడికి ఇప్పటి వడ్డీ అంటే.. ఇదేనేమో కదా..!

Share via
Copy link