Templates by BIGtheme NET
Home >> Cinema News >> అలరిస్తున్న ‘చావు కబురు చల్లగా’ ఫన్నీ టీజర్ గ్లిమ్స్..!

అలరిస్తున్న ‘చావు కబురు చల్లగా’ ఫన్నీ టీజర్ గ్లిమ్స్..!

యంగ్ హీరో కార్తికేయ – లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ”చావు కబురు చల్లగా”. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతో పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో లేటెస్టుగా ‘చావు కబురు చల్లగా’ టీజర్ గ్లిమ్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

”నువ్వు ఈ ఆసుపత్రికి సిస్టర్ వటగా.. మంచి ఉద్యోగమే ఎతుక్కున్నావ్.. మనం ప్రేమించే అమ్మాయి మనకు తప్ప మిగతా వాళ్ళందరికీ సిస్టర్ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో.. సూపర్ ఏహే” అని హీరో కార్తికేయ చెప్పే ఫన్నీ డైలాగ్ ఆకట్టుకుంటోంది. దీనికి ”నాలుగు పీకి ఇక్కడ పడుకోబెడితే నీకు కూడా నేను సిస్టర్ నే అవుతా” అంటూ లావణ్య బదులిస్తుంది. ఈ చిత్రంలో కార్తికేయ స్వర్గపురి వాహనం నడిపే బస్తీ బాలరాజు పాత్రలో కనిపించనున్నాడు. లావణ్య త్రిపాఠి మల్లిక అనే నర్స్ పాత్ర పోషించింది. కార్తికేయ – లావణ్య లను చూస్తుంటే ఇద్దరూ డీ గ్లామరస్ రోల్స్ లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించారని అర్థం అవుతోంది.

ఈ చిత్రంలో మురళీ శర్మ – ఆమని – శ్రీకాంత్ అయ్యంగర్ – మహేష్ – భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. సత్య ఎడిటింగ్ వర్క్ చేస్తుండగా.. జీఎమ్ శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ గా చేస్తున్నారు. ‘చావు కబురు చల్లగా’ చిత్రాన్ని సమ్మర్ కానుకగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Share via
Copy link