Templates by BIGtheme NET
Home >> Cinema News >> హాస్యబ్రహ్మ నుండి కాల్.. సోహెల్ కు మరో బంపర్ ఆఫర్

హాస్యబ్రహ్మ నుండి కాల్.. సోహెల్ కు మరో బంపర్ ఆఫర్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ అయినా సోహెల్ కు ఎక్కువ పేరు మనీ ఆఫర్ లు దక్కాయి. అభిజిత్ కు ప్రైజ్ మనీ రూ.25 లక్షలు మరియు ట్రోఫీ వచ్చింది. కాని సోహెల్ కు 25 లక్షలతో పాటు నాగార్జున నుండి 10 లక్షలు.. చిరంజీవి నుండి మరో 10 లక్షలు కూడా వచ్చాయి. ఇవి మాత్రమే కాకుండి చిరు ఇంటి నుండి మటన్ బిర్యానీ కూడా వచ్చింది. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటీ అంటే నువ్వు సినిమా తీస్తే ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నేను వస్తా అంటూనే చిన్న పాత్ర ఇవ్వు చేస్తానంటూ చిరంజీవి హామీ ఇచ్చాడు. దాంతో బిగ్ బాస్ విన్నర్ సోహెల్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

సోహెల్ చాలా తెలివిగా బయటకు రావడంతో ఆయన్ను అంతా అభినందిస్తున్నారు. ఎపిసోడ్ పూర్తి అయిన కొద్ది సేపటికే సోహెల్ కు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నుండి కాల్ వచ్చిందట. నీ కోసం బిగ్ బాస్ చూసేవాడినయ్యా. నీవు సినిమా చేస్తే చిరంజీవి గారితో పాటు నేను ఫ్రీ గా నీ సినిమాలో నటిస్తానంటూ హామీ ఇచ్చాడట. బ్రహ్మానందం వంటి స్టార్ నుండి కూడా కాల్ రావడంతో సోహెల్ మరింత ఆనందంను వ్యక్తం చేస్తున్నాడు. వీరందరి హామీతో అతి త్వరలోనే సోహెల్ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన వద్దకు పలువురు ఫిల్మ్ మేకర్స్ క్యూ కడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

Share via
Copy link