Templates by BIGtheme NET
Home >> Cinema News >> జనవరిలో సందడి చేయనున్న ‘బంగారు బుల్లోడు’

జనవరిలో సందడి చేయనున్న ‘బంగారు బుల్లోడు’

‘అల్లరి’ నరేష్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘బంగారు బుల్లోడు’. ఇందులో పూజా జవేరి హీరోయిన్ గా నటించింది. పి.గిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడిప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2021 జనవరిలో ‘బంగారు బుల్లోడు’ చేసే అల్లరితో మీ దగ్గరలోని థియేటర్స్ లోకి వస్తున్నాం అంటూ చిత్ర యూనిట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో నరేష్ – పూజా ఓ మాస్ బీట్ కి స్టెప్పులేస్తూ కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం సమకూర్చగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. త్వరలోనే ఈ చిత్రంలోని సాంగ్స్ ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. ఎమ్.ఆర్ వర్మ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇందులో తనికెళ్ళ భరణి – పోసాని కృష్ణ మురళి – ప్రవీణ్ – పృథ్వీ రాజ్ – సత్యం రాజేష్ – వెన్నెల కిశోర్ – ప్రభాస్ శ్రీను – జబర్దస్త్ మహేష్ – భద్రం వంటి భారీ తారాగణం కనిపించనున్నారు. ‘అల్లరి’ నరేష్ చాలా గ్యాప్ తర్వాత తనదైన కామెడీతో రాబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనున్నాడు. కంప్లీట్ ఎంటర్టైనర్ గా వస్తున్న ‘బంగారు బుల్లోడు’ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే వెల్లడించనున్నారు.

Share via
Copy link