Templates by BIGtheme NET
Home >> Cinema News >> బాలయ్య అఘోరగా చూపించాలనుకున్నాడు కానీ..

బాలయ్య అఘోరగా చూపించాలనుకున్నాడు కానీ..

బాలకృష్ణ – బోయపాటి కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బిబి-3. ఈ మూవీకోసం బాలయ్య ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మే 28న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు సోదరులుగా బాలకృష్ణ కనిపించనున్నారట. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ రూమర్ గతంలో బాగా వినిపించింది. బాలకృష్ణ ఈ సినిమాలో అఘోరాగా కనిపించబోతున్నారని ప్రచారం జరిగింది.

నందమూరి అభిమానులు ఈ రూమర్ తో ఒకింత నెర్వస్ గా ఫీలయ్యారు. కారణం ఏమంటే.. అఘోరా గెటప్ అనేది అన్ని సందర్భాల్లోనూ వర్కవుట్ కాదు. కొన్ని సార్లు బ్యాక్ ఫైర్ కూడా అవుతూ ఉంటుంది. ఇన్నీ ఆలోచించిన దర్శకుడు.. అఘోరా గెటప్ ను పక్కన పెట్టడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడని సమాచారం.

బాలకృష్ణ ఓ పాత్రలో పంచె గెటప్ లో కనిపించబోతున్నాడన్న విషయం తెలిసిందే. ఇక మిగిలిన గెటప్ ను రెగ్యులర్ గా చూపిస్తారని తెలుస్తోంది. ఇక బాలయ్య ఫ్యాన్స్ కూడా ప్రయోగాల విషయం పక్కనబెట్టి.. మాస్ మసాల అంశాలతో చిత్రాన్ని లోడ్ చేయాలని కోరుకుంటున్నారు. మరి ఫైనల్ గా బోయపాటి ఎలాంటి పిక్చర్ ను చూపిస్తాడో తెలియాలంటే మే 28 వరకు వెయిట్ చేయాల్సిందే.

Share via
Copy link