Templates by BIGtheme NET
Home >> Cinema News >> షాట్ గన్ వారసురాలు నెవ్వర్ బిఫోర్ లుక్

షాట్ గన్ వారసురాలు నెవ్వర్ బిఫోర్ లుక్

ఫ్యాషన్ ప్రపంచంలో ఫ్యూజన్ డిజైన్స్ కి ఉండే పాపులారిటీ వేరు. డిజైనర్ అర్పిత మెహతా పరిశ్రమలో 10 ఏళ్ల మోడ్రన్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా.. బాలీవుడ్ తారల ముఖ చిత్రాలతో తన కాఫీ టేబుల్ పుస్తకాన్ని `మిర్రర్` పేరుతో లాంచ్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇది డిజైనర్ శైలిని ప్రతిబింబించిన అరుదైన పుస్తకం. ఇందులో పలువురు బాలీవుడ్ అందగత్తెల అందాల్ని రాశిగా పోయడం అర్పిత పేరు ప్రఖ్యాతుల్ని ఇనుమడింప జేస్తోంది. ఇక ఈ ఫోటోషూట్లలో బాలీవుడ్ షాట్ గన్ శత్రుఘ్న సిన్హా వారసురాలు.. స్టార్ హీరోయిన్ సోనాక్షి ఫోటోగ్రాఫ్ సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి.

అద్దాలతో ఎంబ్రాయిడరీ జాకెట్టు.. బ్లాక్ బాటమ్ లో అద్భుతమైన డిజైనర్ లుక్ తో సోనాక్షి సర్ ప్రైజ్ చేసింది. తన డిజైన్ లో విచిత్రమైన వేషధారణ హెయిర్ స్టైల్ హైలైట్ అయ్యాయి. సోనాక్షి సిన్హా జాకెట్ నెక్లైన్ .. సరళమైన స్లిట్ స్కర్ట్ లుక్ ప్రతి కోణంలో ఆకర్షిస్తోంది. అర్పిత కాఫీ టేబుల్ బుక్ 10 సంవత్సరాల లేబుల్ ప్రమోషన్స్ లో సోనాక్షి షూట్ చాలా ప్రత్యేకమైనదన్న ప్రశంసలు దక్కాయి. కెరీర్ సంగతి చూస్తే భుజ్ – ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రంలో అజయ్ దేవగన్ తో కలిసి సోనాక్షి నటిస్తోంది.

Share via
Copy link