Templates by BIGtheme NET
Home >> Cinema News >> వోగ్ కవర్ పై అనుష్క బేబి బంప్ సెన్సేషన్స్

వోగ్ కవర్ పై అనుష్క బేబి బంప్ సెన్సేషన్స్

నేను గర్భవతిని అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది అనుష్క శర్మ. భర్త విరాట్ కోహ్లీతో కలిసి ఈ ఆనందకర వార్తను పంచుకునేందుకు ఇన్ స్టా మాధ్యమంలోకి విచ్చేసింది. సోషల్ మీడియాలో తన బిడ్డ బంప్ ను ప్రదర్శించింది. తాజాగా ప్రఖ్యాత మ్యాగజైన్ `వోగ్ ఇండియా` జనవరి కవర్ పేజీపైనా అనుష్క బేబి బంప్ ఫోటో అభిమానుల్లో ఆసక్తికర చర్చకు తావిస్తోంది. నా కోసం నేను ఈ ఫోటోని క్యాప్చుర్ చేసానని ఫన్నీగా ఉందని తెలిపింది అనుష్క. ఆ లూజ్ ఫ్యాంట్ .. ఫ్రీస్టైల్ లూజ్ సూట్ కోట్ ని ధరించి సర్ ప్రైజ్ చేసింది. వోగ్ తో తన గర్భం సహా జీవిత ప్రయాణం గురించి అనుష్క వివరంగా మాట్లాడింది. గర్భిణిగా తన కోరికల గురించి కూడా అనుష్క శర్మ వెల్లడించారు.

త్వరలోనే మమ్మీ కాబోతున్నా. మొదటి మూడు నెలలు టోస్ట్ క్రాకర్స్ మాత్రమే తిన్నానని వెల్లడించింది. అది ముగిశాక వడా పావ్ .. భెల్ పూరి కోసం ఆరాటపడిందట. కానీ అది ఎక్కువసేపు కొనసాగలేదు. కాబట్టి ఇక అంతగా కోరికలు లేవు అని ఆమె అన్నారు. తనకు అసాధారణంగా ఫుడ్ కి సంబంధించిన కోరికలు లేనప్పటికీ గర్భిణీ స్త్రీలు ఓ రెండిటిని తినవలసిన అవసరం అనే అపోహను తొలగించుకోవడానికి డాక్టర్ సహాయపడిందని వెల్లడించారు.

గర్భధారణ సమయంలో తన డాక్టర్ మెదడును తినేశానని కూడా అన్నారు నవ్వేస్తూ. నేను చాలా చదవడానికి గొప్పగా పరిశోధన చేయడానికి ఇష్టపడే వ్యక్తిని. నేను నా డాక్టర్ మెదడును నమిలేశాను అని చెప్పింది.

అనుష్క తన శరీర మార్పును చూడటం గురించి తన ఆలోచనలను పంచుకుంది. ఈ మార్పులను చూడటం మనసును కదిలిస్తుందని చెప్పింది. ఇది అద్భుతమైనది అని భావించింది. నా శరీరంతో మరింత అనుసంధానమయ్యానని తెలిపింది. గర్భధారణకు ముందే ధ్యానం చేసేదానినని కూడా ఆమె వివరించింది. ఆమె తన రోజువారీ అభ్యాసాన్ని కొనసాగించిందిట. బాలీవుడ్ లో మరో అందాల కథానాయిక కరీనాకపూర్ తన రెండో బేబీకి జన్మనివ్వనున్న సంగతి తెలిసినదే.

Share via
Copy link