Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఈ విపత్తు సమయంలో మెగాస్టార్ ఇంత సాయం చేశారా!

ఈ విపత్తు సమయంలో మెగాస్టార్ ఇంత సాయం చేశారా!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విపత్తుపై పోరాటంకు ఎంతో మంది ప్రముఖులు కోట్లాది విరాళాలను అందించారు ఇంకా అందిస్తూనే ఉన్నారు. వందలు వేల కోట్ల సాయంను ప్రకటించిన వారు కూడా ఉన్నారు. ఇక సోనూసూద్ తనవంతు సాయంగా వలస కార్మికులను వారి వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు రైళ్లు చివరకు విమానం కూడా ఏర్పాటు చేశాడు. అలా పలువురు స్టార్స్ తమకు తోచిన సాయం చేశారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కూడా తాను ఈ కరోనా విపత్తు సమయంలో ఏం చేసింది చెప్పాడు.

ఇటీవలే కరోనాను జయించిన బిగ్ బి విశ్రాంతిలో ఉన్నాడు. ఇదే సమయంలో ఆయన సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూనే ఉన్నాడు. ఒక లైవ్ చాట్ సెషన్ లో అమితాబ్ ను ఒక లేడీ మీరు ఈ విపత్కర పరిస్థితుల్లో పేదవారికి చేసిన సాయం ఏంటీ అంటూ ప్రశ్నించింది. ఆమె ప్రశ్నకు అమితాబ్ సుదీర్ఘ సమాధానం ఇచ్చాడు. నేను ఈ సమయంలో చేసిన కొన్ని సాయాల గురించి ఇన్నాళ్లు చెప్పుకోలేదు. అయితే ఒక మహిళ నన్ను అడగడంతో ఆ విషయాలను చెప్పాలనుకుంటున్నాను.

మా టీం ఇప్పటి వరకు చేసిన మంచి పనుల గురించి ఇక్కడ మీకు చెప్పబోతున్నాను అంటూ… ఏపీ విదర్భ యూపీ బీహార్ సహా పలు రాష్ట్రాల రైతులకు సాయం చేశాం. సినిమా పరిశ్రమకు చెందిన 10 వేల మంది కార్మికులకు ఆరు నెలలకు సరిపోయే రేషన్ ను అందించాం. ముంబయి నుండి కాలి నడకన వెళ్తున్న వలస కార్మికులకు దాదాపుగా 12 వేల చెప్పుల జతలను అందించాం. నాసిక్ హైవేపై వలస కార్మికుల కోసం ఆహారం ఏర్పాటు చేశాం. కొంత మందిని విమానాల ద్వారా వారి వారి గమ్యస్థానాలకు చేర్చాం. ఇక వైధ్య సిబ్బంది కోసం 15 వేల పీపీఈ కిట్స్ను మరియు 10 వేల మాస్క్ లను కూడా అందించామని బిగ్ బి అన్నారు. మొత్తానికి ఈ విపత్తు సమయంలో బిగ్ బి కూడా భారీగానే సాయం చేసినట్లుగా ప్రకటించుకున్నారు.

Share via
Copy link