Templates by BIGtheme NET
Home >> Cinema News >> వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ ఆయనకు ఊపిరి పోసింది!

వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ ఆయనకు ఊపిరి పోసింది!

హిట్టును నమ్మే పరిశ్రమలో ఆ హిట్టు దక్కితే ఎలా ఉంటుందో వకీల్ సాబ్ నిరూపిస్తోంది. ఓవర్ నైట్ పవర్ స్టార్ ఈజ్ బ్యాక్! అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అగ్ర హీరో కంబ్యాక్ ఈ రేంజులో ఉండడంతో ఇండస్ట్రీలోనూ హుషారు పెరిగింది. ఇక ఇదే ఊపులో పవర్ స్టార్ మార్కెట్ కి అనుహ్యంగా జవసత్వాలు వచ్చి పడుతున్నాయట.

వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ పాన్ ఇండియా మూవీ తీస్తున్న ఏ.ఎమ్ రత్నం ఊపిరి పీల్చుకున్నారట. అతడు అత్యంత భారీ బడ్జెట్ తో పవన్ కెరీర్ బెస్ట్ మూవీ తీయాలని క్రిష్ దర్శకత్వంలో `హరిహర వీరమల్లు` ప్లాన్ చేశారు. పాన్ ఇండియా కేటగిరీలో ఇది అత్యంత భారీగా రిలీజ్ కానుంది. అయితే ఎంత పాన్ ఇండియా సినిమా అయినా ఈ ప్రాజెక్ట్ కి ఎక్కువు డబ్బులు వచ్చేది తెలుగులోనే అన్నది వాస్తవం. అయితే ఇంతవరకు తెలుగులోనే ఈ సినిమా ప్రీ బిజినెస్ ఓపెన్ చేయలేదు. ఎందుకంటే గతంలో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం సాగిన నేపథ్యంలో మార్కెట్ వాల్యూ బాగా తగ్గిపోవడంతో ఏఎమ్ రత్నం ఎవరి దగ్గరా అడ్వాన్సులు తీసుకోలేదని గుసగుసలు వినిపించాయి.

కానీ ఇప్పుడు అంతా అనూహ్యంగా మారింది. పవన్ నటించిన వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మార్కెట్ లెక్కలు అమాంతం పెరిగాయని టాక్ వినిపిస్తోంది. కేవలం తెలుగులోనే దాదాపుగా 200 కోట్లు బిజినెస్ డీల్స్ జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రైసిస్ లోనూ కంబ్యాక్ తో అదరగొట్టిన పవన్ కి ఆయన నిర్మాతలకు అంతా ప్లస్ గా మారుతోందిట.

Share via
Copy link