Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘రంభ ఊర్వశి.. సాంగ్’తో ఊపేస్తున్న మోనాల్ గజ్జర్.. కొత్తపాట విడుదల!!

‘రంభ ఊర్వశి.. సాంగ్’తో ఊపేస్తున్న మోనాల్ గజ్జర్.. కొత్తపాట విడుదల!!

బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడుగా తెరకెక్కిన తాజా చిత్రం అల్లుడు అదుర్స్. ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 14న థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అల్లుడు అదుర్స్ మేకర్స్ ప్రమోషన్స్ దూకుడుగా చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ ట్రైలర్ లిరికల్ సాంగ్స్ అంటూ సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసిన చిత్రబృందం.. తాజాగా అల్లుడు అదుర్స్ నుండి ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేసింది. మాములుగా బెల్లంకొండ హీరో సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కి మంచి స్కోప్ ఉంటుంది. అల్లుడుశీను దగ్గర నుండి దాదాపు అన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్స్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు శీను. తాజాగా ‘రంభ ఊర్వశి మేనకా’ అనే స్పెషల్ సాంగ్ విడుదల చేసి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నారు. మంచి మాస్ బీట్ కి దాదాపు రొమాన్స్ లో క్వీన్స్ అనిపించుకున్న అందరి పేర్లను కవర్ చేశారు లిరిక్ రైటర్.

అయితే ఈసారి ఐటమ్ సాంగ్ కోసం బిగ్ బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ ని లైన్ లోకి తీసుకొచ్చాడు శీను. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో మోనాల్ ఐటమ్ స్టెప్స్.. ఫ్యాన్స్ తో ఈలలు వేయించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. సిల్క్ స్మిత నుండి నిన్న మొన్నటి సన్నీలియోన్ వరకు అందరిని వాడేసాడు గీతరచయిత శ్రీమణి. ఇక దేవిశ్రీప్రసాద్ ఎప్పటిలాగే ఐటమ్ పాటకి ఇవ్వాల్సిన కిక్కు ఇచ్చేసినట్లే అనిపిస్తుంది. అయితే దేవిశ్రీ మాస్ బీట్ కి సింగర్ మంగ్లీ హేమచంద్రలు గాత్రం కలిపి మరింత జోష్ పెంచారు. ప్రస్తుతం మోనాల్ అందాలు సాంగ్ పై మరింత అటెన్షన్ పెంచుతున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్ లో ‘రంభ ఊర్వశి మేనకా’ సాంగ్ వైరల్ అవుతోంది. ఇక నభా నటేష్ అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తుండగా సోనూసూద్ ప్రధాన పాత్రలో నటించాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.

Share via
Copy link