Templates by BIGtheme NET
Home >> Cinema News >> 2020ని థమన్ నామ సంవత్సరంగా ప్రకటించాలి

2020ని థమన్ నామ సంవత్సరంగా ప్రకటించాలి

2020 ఎందరికో పీడకలల్ని మిగిలిస్తే సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ కి మాత్రం తీపి కలల్ని అందించింది. 2020 చార్ట్ బస్టర్స్ జాబితా తిరగేస్తే టాప్ 5లో అన్నీ థమన్ పాటలే ఉంటాయంటే అతిశయోక్తి లేదు. అంతగా అల వైకుంఠపురములో పాటలు పాపులరయ్యాయి. మిలియన్ ట్రిలియన్ వ్యూస్ తో అల.. పాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా దూసుకెళ్లాయి.

మాలీవుడ్ లో ప్రఖ్యాత క్రిటిక్ సైతం 2020 టాప్ సాంగ్స్ జాబితాలో అల వైకుంఠపురములో పాటల్ని చేర్చారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం మలయాళంలో `అంగు వైకుంఠపురతు` పేరుతో రిలీజైంది. మాలీవుడ్ నుంచి 2020 ఉత్తమ 20 పాటలను ‘2020 ఉత్తమ గాత్రాలు’ పేరిట ఎంపిక చేయగా.. అందులో `సామజవరాగమన…` ఒక గీతంగా నిలిచింది.

ఓవరాల్ గా క్రైసిస్ కొనసాగినా ఆరంభం అదిరింది.. ముగింపు అదిరింది. ఇదంతా థమన్ క్రేజును పెంచింది. నిజానికి ఈ సంవత్సరాన్ని తమన్ నామ సంవత్సరంగా ప్రకటిస్తే తప్పేమీ కాదు. కథానాయకుల్లో అల వైకుంఠపురములో స్టార్ అల్లు అర్జున్ కి ఇటు టాలీవుడ్ తో పాటు అటు మాలీవుడ్ లోనూ గౌరవం పదింతలు పెరిగింది ఒకే ఒక్క సినిమాతో. 2020 నెగెటివిటీని నింపినా కానీ చాలా పాజిటివ్ బుద్ధిని మనిషికి నేర్పించి వెళుతోంది. జాను నుండి ఓహలే సాంగ్ కూడా టాప్ 20 మాలీవుడ్ పాటలకు ఎంపికైంది. జానుకు కన్నడ మ్యూజిక్ కంపోజర్ గోవింద్ వసంత సంగీతం అందించారు.

Share via
Copy link