Templates by BIGtheme NET
Home >> Cinema News >> నందమూరి మూవీలో అఫ్ఘనిస్థానీ ఐటెం

నందమూరి మూవీలో అఫ్ఘనిస్థానీ ఐటెం

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా స్వీయ నిర్మాణంలో నిర్మిస్తున్న సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. ఈ సినిమా చిత్రీకరణ అప్ డేట్ ఇప్పటి వరకు ఏమీ లేదు. కాని మొదటి సారి ఈ సినిమాలో ఐటెం సాంగ్ ను అఫ్ఘనిస్థాన్ కు చెందిన హాట్ బ్యూటీ వారిన హుస్సేన్ తో చేయిస్తున్నారట. బాలీవుడ్ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా దూసుకు పోతుంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్న వారిన హుస్సేన్ మొదటి సారి సౌత్ ఇండస్ట్రీలో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాతో అడుగు పెట్టబోతుంది. ఈ సినిమా టైటిల్ ను ఇంకా నిర్ణయించలేదు.

భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా తో మల్లిడి వేణు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రావణుడి తరహా పాత్రలో కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సోషియో ఫాంటసీ తరహ కథతో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలను తెలియజేయడంతో పాటు విడుదల తేదీని అనౌన్స్ చేయబోతున్నారు. సినిమా లో అఫ్ఘన్ బ్యూటీతో ఐటెం సాంగ్ చేయించడం వల్ల సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. కళ్యాణ్ రామ్ సక్సెస్ కోసం సుదీర్ఘ కాలంగా వెయిట్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయినా ఆ సక్సెస్ ను దక్కించుకుంటాడేమో చూడాలి.

Share via
Copy link