Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆచార్య ఆడియో హక్కులు దక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్!

ఆచార్య ఆడియో హక్కులు దక్కించుకున్న ఆదిత్య మ్యూజిక్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సైరా తర్వాత మెగాస్టార్ నటిస్తున్న 152వ సినిమా కావడంతో ఆచార్య పై అంచనాలు భారీస్థాయిలో నెలకొన్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఖైదీ నెంబర్ 150 తర్వాత మరోసారి కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో చిరు సరసన నటిస్తోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరిదశలో ఉంది. అయితే ఆచార్య సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్లీ మెగాస్టార్ సినిమా చేసే అవకాశం దక్కిందని అంటున్నాడు. ప్రేక్షకుల్లో చిరంజీవి చేసే మెస్మరైజింగ్ డ్యాన్సులు యాక్షన్ క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఆచార్య సినిమాలో మెగాస్టార్ మార్కు డ్యాన్సులు ఎంటర్టైన్మెంట్ మిస్సవ్వకుండా చూసుకుంటున్నారట మేకర్స్. మెగాస్టార్ – మణిశర్మ కాంబినేషన్ ఆల్బమ్ మ్యూజిక్ ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి తెలుగు ప్రేక్షకులకు రుచి చూపాలని అనుకుంటున్నారట. అయితే ఆచార్యలో డ్యూయెట్స్ తో పాటు ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉందట. ఈసారి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాములుగా ఉండదని టీజర్ లోనే చెప్పేసాడు.

ఆచార్య మూవీ వేసవి కానుకగా మే 13న థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ వారు దక్కించుకున్నారు. ఆచార్య కోసం దాదాపు నాలుగు కోట్లవరకు వెచ్చించినట్లు ఇండస్ట్రీ టాక్. అయితే ఆచార్య ఆడియో హక్కులను సొంతం చేసుకున్నట్లు స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలిపారు. ఇక ఈ సినిమాలో రాంచరణ్ పూజహెగ్డే కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Share via
Copy link