Templates by BIGtheme NET
Home >> Cinema News >> సంక్రాంతి రేసులో పాయల్..

సంక్రాంతి రేసులో పాయల్..

RX 100 చిత్రంతో కుర్రకారు గుండెల్లో అలజడి రేపింది పాయల్ రాజ్పుత్. ఈ మూవీలో పాయల్ అందానికి అభినయానికి యూత్ ఫిదా అయింది. ఆ చిత్రం తర్వాత ఈ అమ్మడి కెరీర్ రాకెట్ లా దూసుకుపోతుందని భావించినప్పటికీ.. పెద్దగా బ్రేక్ రాలేదు. ‘వెంకీమామ’ వంటి చిత్రంలో నటించినాా అది తనకు పెద్దగా ప్లస్ కాలేదు. ఆ తర్వాత ‘అనగనగా ఓ అతిథి’ అనే చిత్రంలో నటించింది పాయల్. దయాల్ పద్మనాభం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ గత నెలలలో ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ కోసం పాయల్ భారీగా ప్రచారం చేసింది. కానీ.. అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

లాక్ డౌన్ తర్వాత.. మెల్లమెల్లగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో ఓపెన్ అవుతాాయనే అంచనాకు నిర్మాతలు వచ్చేశారు. దీంతో.. పలు సినిమాలు ఫెస్టివల్ రేసులోకి వచ్చేస్తున్నాయి. ఇందులో పాయల్ రాజ్ పుత్ నటించిన 5W సినిమా కూడా ఉంది. అ చిత్రం ద్వారా మంచి బ్రేక్ సాధించాలని ఆశిస్తోంది పాయల్.

అయితే.. ఇప్పటికే సంక్రాంతి బరిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన ‘రెడ్’ ఒకటి కాగా.. మాస్ మహరాజ్ రవితేజ నటించిన ‘క్రాక్’ చిత్రం రెండోది. ఈ సినిమాలను సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. మరి పాయల్ రాజ్పుత్ చిత్రం ఈ రెండు చిత్రాలతో ఢీకొని ఎలాంటి ఫలితం పొందనుందనే చర్చ సాగుతోంది. ఈ చిత్రంలో పాయల్ పోలీసు అధికారిగా నటించారు. ఈ చిత్రానికి ప్రణదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించారు.

Share via
Copy link