Templates by BIGtheme NET
Home >> Cinema News >> 2020 రివ్యూ: టాప్ ట్రెండింగ్ లో హిందీ స్టార్లు వీళ్లే

2020 రివ్యూ: టాప్ ట్రెండింగ్ లో హిందీ స్టార్లు వీళ్లే

2020 సంవత్సరం భీభత్సనామ సంవత్సరం అనే చెప్పాలి. ప్రజలు సగం పైగా ఇళ్లకే అంకితమై ఉపాధి పొందలేని తీవ్ర పరిస్థితి నెలకొంది. వాస్తవానికి కోవిడ్ -19 మహమ్మారి దేశాలను లాక్ డౌన్ కి కారణమై ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేసింది. వినాశనంతో ప్రారంభమైన సంవత్సరం వేగంగా దిగజార్చింది. మహమ్మారితో చాలా దూరం ప్రయాణించినా ఇంకా జనం కోలుకోలేదు.

వ్యాక్సిన్ తో జీవితం తిరిగి సాధారణ స్థితికి రావడం కుదురుతుందన్న హోప్ అయితే ఉంది. ఇక ఇంతకాలం చిత్రపరిశ్రమ కష్టాల గురించి చెప్పనలవి కాదు. భారతదేశంలో షూటింగులు రద్దయ్యాయి. సినిమా విడుదలలు నిరవధికంగా వాయిదాల ఫర్వానికి లోనవ్వడంతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. ఏదేమైనా ఈ సంక్షోభ సమయాల్లో పరిశ్రమలోని ప్రతిభావంతుల్లో కొన్ని పేర్లు వారి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల రూపంలో లేదా వారి ప్రతిభావంతమైన ప్రదర్శనలతో పాపులరయ్యాయి. పలువురు ప్రముఖుల మానవతా సాయం న్యూస్ హెడ్ లైన్స్ లో నిలిచింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు స్టార్ల వివరాల్ని పరిశీలిస్తే..‘2020 సంవత్సరపు న్యూస్ మేకర్స్’ గా రికార్డులకెక్కినవారి వివరాలివి.

2020 సంవత్సరంలో న్యూస్మేకర్స్ జాబితాలో అక్షయ్ కుమార్- కంగనా రనౌత్- సోను సూద్ – ప్రతీక్ గాంధీ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. మహమ్మారి గురించి మాట్లాడేటప్పుడు గుర్తుకు వచ్చే పేరు అక్షయ్ కుమార్. బాలీవుడ్ యాక్షన్ హీరో గతంలో ఎన్నోసార్లు సాయం చేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. మహమ్మారి సమయంలో మరోసారి ఆయన కీర్తి అనంతంగా పెరిగింది. అక్షయ్ కుమార్ మహమ్మారి సమయంలో బాధపడుతున్న వారికి సహాయపడటానికి పీఎం కేర్స్ ఫండ్ కు 25 కోట్లు డొనేట్ చేశారు. అతను కష్టాల్లో ఉన్న పరిశ్రమ సభ్యులకు వ్యక్తిగతంగా సహాయం చేయడానికి కూడా ముందుకు వచ్చారు. అంతేకాకుండా మహమ్మారి సమయంలో విడుదలైన లక్ష్మి చిత్రం.. అలాగే ఒక చిత్రానికి సంబంధించిన పనిని ప్రారంభించిన మొదటి నటుడిగా అక్షయ్ కుమార్ రికార్డులకెక్కారు.

దీపికా పదుకొనే ఒక పెద్ద సామాజిక సమస్య యాసిడ్ దాడిపై ప్రభావవంతమైన చిత్రం చేసింది. ఛపాక్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించకపోయినా ఈ చిత్రానికి అనుకూలంగా సోషల్ మీడియా రివ్యూలు వైరల్ కావడంతో పాటు ఇది భారీ ప్రభావాన్ని చూపింది. ఇదే కాకుండా చపాక్ చిత్రం విడుదలకు కొద్ది రోజుల ముందు దీపికా పదుకొనే జెఎన్ యు విద్యార్థులపై విశ్వవిద్యాలయ ప్రాంగణంలో దాడి చేసిన తరువాత విద్యార్థులకు మద్దతుగా నిలబడటం వార్తల్లో వైరల్ అయ్యింది.

ఇటీవల తన సోషల్ మీడియాలో కంగనా రనౌత్ వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో నిలిచారు. రోజువారీ వ్యవహారాలకు సంబంధించి రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. పంజాబీ గాయకుడు నటుడు దిల్జిత్ దోసంజ్ తో ఇటీవల వైరం వేడెక్కించింది. ఈ ఏడాదిలో పలువరు హీరోలు దర్శకులతో గొడవల తోనూ పాపులరైంది కంగన పేరు. జయలలిత పాత్రను పోషిస్తున్న తలైవికి సంబంధించిన కథనాలు వైరల్ అయ్యాయి.

ప్రతీక్ గాంధీ `స్కామ్ 1992` చిత్రంలో తన నటనతో ఈ సంవత్సరం ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ అయ్యారు. ప్రతీక్ నటన ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యింది. వాస్తవికతతో తెరకెక్కిన ఈ చిత్రం హాట్ టాపిక్ అయ్యింది. పరిపూర్ణ పనితీరు శక్తితో మాత్రమే ఈ సంవత్సరం జాబితా రూపొందిస్తే ప్రతిభావంతులు వైరల్ గా పాపులరైన వారు వీళ్లు మాత్రమే.

Share via
Copy link