Templates by BIGtheme NET
Home >> Cinema News >> లోతులకు భయపడకపోతే నాతో రండి అంటోంది!

లోతులకు భయపడకపోతే నాతో రండి అంటోంది!

లోతులకు భయపడకపోతే నాతో రండి అంటోంది! అంటోంది సోనాల్ చౌహాన్.. ఈ అమ్మడి పరిచయం అవసరం లేదు. హ్యాపీడేస్ రాహుల్ సరసన తొలిసారి సోలో నాయికగా నటించిన సోనాల్ కి ఆ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ సరసన నటించాక గుర్తింపు దక్కింది. బాలయ్య సరసన లెజెండ్- డిక్టేటర్ – రూలర్ సినిమాల్లో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్ అయినా ఎందుకనో లక్ కలిసిరాలేదు.

ఆ క్రమంలోనే సోనాల్ ముంబై పరిశ్రమలో బిజీ అవ్వాలని ప్రయత్నించింది. కానీ అక్కడా అవకాశాల్లేవ్. ఇక సోనాల్ చౌహాన్ తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత జీవితంలో ఏం జరిగినా తన అభిమానులకు నిరంతరం అప్ డేట్ చేయడానికి వెనకాడదు. మొన్న క్రిస్మస్ వేడుకలు సహా నూతన సంవత్సర వేడుకలను ఈ అమ్మడు సంబరంగా జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం సోనాల్ గోవా పర్యటనలో ఉంది. అక్కడి నుండి వరుసగా వేడెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చాలా ఫోటోల్ని పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి.

ఇంతకుముందు పూల్ పైడ్ ట్రీట్ కి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసింది. తాజాగా బికినీ బీచ్ లో ఇసుక తిన్నెల్లో చిద్విలాసంగా నవ్వులు చిందిస్తున్న ఓ హాట్ ఫోటోని సోనాల్ షేర్ చేసింది. ఇందులో పింక్ రెడ్ టాప్.. వైట్ బాటమ్ వేర్ తో సోనాల్ మైమరిపించింది. టూపీస్ లో సోనమ్ అందాలు యూత్ ని పిచ్చిగా కవ్వించేస్తున్నాయి మరి. ఇంతగా ట్రీటిస్తున్న ఈ అమ్మడిని పిలిచి మన దర్శకనిర్మాతలు మళ్లీ అవకాశాలిస్తారేమో చూడాలి. బోయపాటి.. శ్రీవాస్ .. పూరి వీళ్లలో ఎవరైనా పిలిచి మరీ ఛాన్సులిచ్చేస్తారేమో?

Share via
Copy link