Templates by BIGtheme NET
Home >> Cinema News >> గ్లామర్ డోస్ పెంచి ‘బోల్డ్’ఎంటర్ టైన్ చేయబోతున్న అంజలి..

గ్లామర్ డోస్ పెంచి ‘బోల్డ్’ఎంటర్ టైన్ చేయబోతున్న అంజలి..

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో అంజలి పోషించిన పాత్రకు ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ రోల్ తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేదు. అయితే.. ఈ బ్యూటీకి అదే పెద్ద సమస్యై కూర్చుంది. ‘సీత’ను ఓన్ చేసుకున్న తెలుగు ఆడియన్స్.. ఆమెను ‘హోమ్లీ’పాత్రలకే పరిమితం చేశారు. ఇది అంజలికి చాలా ఇబ్బందిగా తయారైంది. హీరోయిన్ అంటే.. అన్ని పాత్రలూ వేయాలి. అప్పుడే తన కెరీర్ దూసుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా.. యూత్ ను అట్రాక్ట్ చేయాలంటే పరువాలు ఒలికించాల్సిందే. కానీ.. ఫ్యామిలీ టైప్ పాత్రలకే పరిమితమైతే మాత్రం ఇక అంతే సంగతులు. మెల్ల మెల్లగా కెరీర్ గ్రాఫ్ పడిపోవడానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అంజలి కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంది. తనపై పడ్డ ‘ఫ్యామిలీ మరక’ను కడిగేసుకునేందుకు చాలానే ప్రయత్నించింది పాపం. ఆ మధ్య ‘సరైనోడు’ మూవీలో ఐటమ్ సాంగ్ లో నర్తించిన ఈ అమ్మడు.. కాస్త స్కిన్ షో చేసినప్పటికీ ‘మరక’ మరీ మొండిదో ఏమో.. పెద్దగా వదల్లేదు.

దీంతో.. ఇక లాభం లేదనుకున్న అంజలి బేబి.. ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకుంది. సీన్ కట్ చేస్తే.. ఇంతకు ముందు ఎప్పుడూ చూడనంత ‘బోల్డ్’ యాక్ట్తో ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ‘పావ కథైగళ్’తో వచ్చిన ఛాన్స్ను పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్న అంజలి.. కొత్త ఇమేజ్తో దూసుకుపోతోంది. ఈ విషయం గుర్తించిన పలువురు ఓటీటీ మేకర్స్.. బోల్డ్ కంటెంట్తో అంజలి ఎదుట వాలిపోతున్నారట. చూడాలి మరి.. అంజలి పాప కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో?

Share via
Copy link