Templates by BIGtheme NET
Home >> Telugu News >> మరో రికార్డ్ సృష్టించిన ట్రంప్ .. 130 ఏళ్లలో మొదటిసారి అలా !

మరో రికార్డ్ సృష్టించిన ట్రంప్ .. 130 ఏళ్లలో మొదటిసారి అలా !

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో రికార్డ్ సృష్టించాడు. అదేమిటి అంటే .. 130 ఏళ్ల తర్వాత లేమ్ డక్ కాలంలో తొలి మరణశిక్ష ను అమలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఈ మద్యే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ జో బైడెన్ చేతుల్లో ఓటమి చెందిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ పదవీకాలం జనవరి 20 న పూర్తి కాబోతుంది. వచ్చే ఏడాది జనవరి 20 న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి వరకు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతారు. కూర్చి దిగబోయే ముందు ట్రంప్ ఓ అరుదైన రికార్డు సృష్టించారు. 40 ఏళ్ల బ్రాండన్ బెర్నార్డ్ అనే వ్యక్తికి కోర్టు విధించిన మరణశిక్షను ట్రంప్ యంత్రాంగం అమలు చేసింది.

18 సంవత్సరాల వయస్సులో బెర్నార్డ్ ఓ నేరానికి సహచరుడిగా వ్యవహరించినందుకు గాను అతనికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ.. తీర్పు నివ్వగా నిన్న దాన్ని అమలు చేశారు. ఇది ఈ సంవత్సరంలో ఫెడరల్ ప్రభుత్వం అమలు చేసిన తొమ్మిదవ ఉరిశిక్ష. 130 ఏళ్ల తర్వాత లేమ్ డక్ కాలంలో అమలు చేసిన తొలి మరణశిక్ష బెర్నార్డ్ది కావడం విశేషం. రెండు దశాబ్దాల క్రితం టెక్సాస్కు చెందిన ఓ స్ట్రీట్ గ్యాంగ్ అయోవాలో ఓ జంటను హత్య చేసింది. 2000 సంవత్సరంలో జరిగిన ఈ దారుణంలో బెర్నార్డ్ క్రిస్టోఫర్ వియాల్వా అనే మరో వ్యక్తితో కలిసి ఈ హత్యకు పాల్పడ్డట్లు తెలిసింది. ఈ గ్యాంగ్లో బెర్నార్డ్ కూడా ఉన్నాడు.

దీనితో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఇక ఇండియానా టెర్రె హాట్ లోని ఫెడరల్ జైలులో స్థానిక సమయం ప్రకారం గురువారం రాత్రి 9:27 గంటలకు బెర్నార్డ్ కు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. బెర్నార్డ్కు శిక్ష విధించడం పట్ల పలువురు ప్రముఖులు నిరసన వ్యక్తం చేశారు. బెర్నార్డ్ మరణశిక్షని నిలిపివేయాలంటూ పిలుపునిచ్చిన వేలాది మందిలో పలువురు న్యాయవాదులు కాంగ్రెస్ ప్రతినిధులు ప్రముఖులు ఉన్నారు.

Share via
Copy link