Templates by BIGtheme NET
Home >> Telugu News >> హైదరాబాద్ డాక్టర్ కు అరుదైన గుర్తింపు.. 50 ఏళ్లలో తొలిసారి భారతీయ వైద్యుడికి పురస్కారం

హైదరాబాద్ డాక్టర్ కు అరుదైన గుర్తింపు.. 50 ఏళ్లలో తొలిసారి భారతీయ వైద్యుడికి పురస్కారం

హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యుడికి అరుదైన గుర్తింపు లభించింది. గడిచిన యాభై ఏళ్లలో భారతదేశం మొత్తంలో ఏ డాక్టర్ కు దక్కని అంతర్జాతీయ గుర్తింపు తాజాగా లభించింది.ఇంతకీ ఆ వైద్యుడు ఎవరంటారా? ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఛైర్మన్.. జీర్ణకోవ వ్యాధుల నిపుణుడు డి. నాగేశ్వరరెడ్డికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ సంస్థ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ ఆఫ్ సైన్సెస్ లో స్థానం లభించింది.

దీని గొప్పతనం ఏమిటంటే.. ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్న వారిలో అత్యధికులు నోబెల్ పురస్కార గ్రహీతలతో పాటు అంతర్జాతీయ ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలకు మాత్రం ఈ ఫెలో షిప్ లబిస్తుంది. తాజాగా లభించిన గుర్తింపుతో వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ఆయనకు అధికారిక ధ్రువపత్రంతో పాటు.. బంగారం.. నీటి రంగుతో కూడిన బ్యాడ్జిని అందజేస్తారు.

నాగేశ్వరరెడ్డి గొప్పతనం ఏమంటే.. క్లోమగ్రంధి సమస్యల్ని ఎండోస్కోపీ ద్వారా నిర్దారించటం.. అత్యాధునిక చికిత్సా విధానాల్ని ప్రపంచానికి ఆయన పరిచయం చేశారు. ఈ ఫెలో షిప్ ను 1874 నుంచి ప్రారంభించారు. 1878లో ప్రముఖ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసిన్ కు దక్కింది. ఈ ఏడాదికి ప్రపంచ వ్యాప్తంగా 489 మందికి ఇస్తే.. అందులో మన దేశానికి చెందిన ఒకే ఒక్కడికే ఈ ఫెలోషిప్ లభించింది. అతడు.. తెలుగోడు కావటం మనందరికి గర్వకారణంగా చెప్పక తప్పదు.

Share via
Copy link