Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఒక్క క్లిక్ తో రైతులకు 17వేల కోట్లు పంచిన మోడీ!

ఒక్క క్లిక్ తో రైతులకు 17వేల కోట్లు పంచిన మోడీ!

ఖరీఫ్ ప్రారంభం వేళ రైతులనుప్రధాని నరేంద్రమోడీ ఆదుకున్నారు. ఏకంగా పీఎం కిసాన్ యోజన పథకం కింద ఒకే రోజు 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17100 కోట్లను జమ చేశారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ లో మోడీ నగదు బదిలీ చేశారు.

కేంద్రంలోని బీజేపీ సర్కార్ ‘పీఎం కిసాన్ యోజన పథకం’ కింద పేద రైతులకు ఏటా రూ.6వేల ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా రూ.2వేల చొప్పున అందజేస్తున్నారు. 2018 డిసెంబర్ 1 నుంచి ఈ పథకం ప్రారంభమైంది.

ఆరోవిడత నగదు బదిలీని ఈ ఆదివారం ప్రధాని చేపట్టారు. ఈ పథకం కోసం కేంద్రం రూ.75వేల కోట్లను కేంద్రం బడ్జెట్లో కేటాయించింది.

హలాన్నే ఆయుధంగా మలిచిన బలరాముడి జయంతి సందర్భంగా రైతులందరికీ పిఎం కిసాన్ నిధులను వారి ఖాతాల్లో జమ చేయడం ఆనందంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. మధ్యవర్తులు దళారుల ప్రమేయం లేకుండా రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు చేరుతున్న ఈ పథకం గొప్పవిజయం సాధించిందని మోడీ అన్నారు.

Share via
Copy link