Templates by BIGtheme NET
Home >> Telugu News >> బీజేపీ పై సంచలన కామెంట్ చేసిన పీకే

బీజేపీ పై సంచలన కామెంట్ చేసిన పీకే

దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే). ఆయన సీఎం జగన్ సహా మమతా బెనర్జీనితీష్ కేజ్రీవాల్ ఇలా ఎందరినో తన వ్యూహాలతో గెలిపించారు. సోమవారం ఆయన బీజేపీకి షాకిచ్చేలా కామెంట్స్ చేశారు. రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి ఘోర పరాజయం ఖాయమని అంచనావేశారు. బెంగాల్ ఎన్నికలలో ఆ పార్టీ రెండంకెల మార్కును కూడా దాటడానికి కష్టపడుతుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. పశ్చిమబెంగాల్లో బీజేపీ పాగా వేయాలని ఎప్పటి నుంచో భావిస్తోంది. అధికార తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని ఓడించడానికి శాయశక్తులు ఒడ్డుతోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. అయితే బీజేపీ వ్యూహాలకు ప్రతీగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ కు వ్యూహాకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవరిస్తున్నాడు. తాజాగా ఆయన బీజేపీపై ట్వీటర్లో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. ‘రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ఎత్తులు వేసిన పది సీట్లకు మించి గెలువదని.. మమత బెనర్జీనే విజయం సాధిస్తుందని పీకే జోస్యం చెప్పాడు. బెంగాల్లో బీజేపీకి డబుల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు వస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ’ సవాల్ విసిరాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ లో బీజేపీని గెలిపించే బాధ్యతను భుజానకెత్తుకున్నాడు. డిసెంబర్ 19 న రాష్ట్ర పర్యటన సందర్భంగా బిజెపిలోకి నేతలను పెద్ద ఎత్తున ఫిరాయింపచేశాడు. తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) మంత్రి సువేందు అధికారితో సహా పలువురు ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగారు.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు.. అధికార టిఎంసి వామపక్ష పార్టీలు కాంగ్రెస్ నాయకులు 2021 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిజెపిలో చేరినా విజయం తృణమూల్ దేనని పీకే కుండబద్దలు కొట్టాడు. .

రాష్ట్రంలో మూడు దశాబ్దాల వామపక్ష పాలనను అంతం చేయాలని బిజెపి ప్రయత్నిస్తుంది. 2019 ఎన్నికలలో పార్టీ లోతుగా ప్రవేశించలేని కొన్ని రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ఒకటి అయినప్పటికీ 42 స్థానాల్లో 18 స్థానాలను గెలుచుకుంది టిఎంసి ప్రభుత్వానికి స్పష్టమైన వ్యతిరేకతగా ఉద్భవించింది.

Share via
Copy link