హాయ్ హాయ్ నాయిక! మొత్తానికి రంగుల్లో వచ్చేస్తున్నాడు.
నలుపు తెలుపు "మాయాబజార్" చిత్రానికి రంగులు అద్దిన వాళ్లకు వేద్దాం రండి రెండు వీరతాళ్లు. ఘటోత్కచుడు ఆరగించిన వివాహ భోజన వంటకాలు, అందాల శశిరేఖ ఆభరణాలు, ప్రతాపాలను నమ్ముకున్న తమ్ముడు అభిమన్యుడి కోసం లోకాలను కకావికలు చేసే ఘటోత్కచుడు అంతా రంగుల్లో కన్పించనున్నారు.కె.వి.రెడ్డి సృష్టించిన ఈ నలుపు తెలుపు కళా ఖండానికి గోల్డెన్‌స్టోన్ సంస్థ రంగులు అద్దింది. అద్భుతమైన ఈ సినిమాను రంగుల్లో చూసే అందమైన అవకాశం ఈ నెల 30వ తేదీన రానుంది. వెండితెరపై శ్రీకృష్ణుడి గెటప్‌లో ఎన్టీఆర్ పంచవర్ణ శోభితంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సూపర్‌గుడ్ సంస్థ విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా గోల్డెన్ సంస్థ ప్రతినిధి వాకాడ అప్పారావు ఆదివారం నాడు మాట్లాడుతూ.. 50 నుంచి 60 ప్రింట్లతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు. గోల్డ్‌స్టోన్ టెక్నాలజీ, కలర్ టెక్నాలజీ డెవలప్‌చేసి అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది. జి. జగన్మోహన్ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపుదిద్దుకుందని అప్పారావు చెప్పారు.
జగన్మోహన్ మాట్లాడుతూ.. కలర్, సంగీతం ఏమాత్రం తేడా లేకుండా 165 మంది టెక్నికల్ టీమ్‌తో దాన్ని అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. జాతీయస్థాయిలో "మొగల్ ఎ అజామ్" చిత్రం తర్వాత మళ్లీ కలర్‌ఫుల్‌గా వచ్చిన చిత్రమిది. మాయాబజార్‌లో ఉన్న కలర్స్‌ను ఏ చిత్రంలోను వాడలేదు.
నెగెటివ్‌గా కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి, అందులో ఏవి పనికి వస్తాయో? ఏవి డామినేట్ చేస్తాయో? అని ప్రతి క్షణం ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ చిత్రాన్ని చూసిన అక్కినేని నాగేశ్వరరావు ప్రశంసించారు. టెక్నాలజీ అమెరికా ఇచ్చినప్పటికీ ఆంధ్రులే "మాయాబజార్"ను అద్భుతంగా రూపొందించారు.
ఈ సినిమాను చూసి అమెరికా కంపెనీలు పది సినిమాల ఆఫర్లు కూడా ఇచ్చారు. మాయాబజార్ కలర్‌గా మార్చడానికి దాదాపు ఐదు కోట్లు ఖర్చైంది. ఇదేదో డబ్బు కోసం ఈ చిత్రానికి పనిచేయలేదు. మన పనివిధానం ప్రపంచానికి తెలియజేయడానికే చేశాం. భవిష్యత్‌లో మరిన్ని విదేశీయులకు చెందిన బ్లాక్ అండ్ వైట్ సినిమాలను కూడా కలర్‌ఫుల్ చేసే ఆలోచన ఉంది" అని జగన్మోహన్ వెల్లడించారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- మార్చిలో ఉపేంద్ర, దీపికా పడుకునేల "కంత్రీ మొగుడు"
- పవన్ కళ్యాణ్ 'పులి' రిలీజ్ డేట్
- తాజ్‌మహల్ పూర్తయింది
- శేఖర్ కమ్ముల 'లీడర్' చిత్రం రిలీజ్ డేట్?
- వచ్చే నెలలో "కిక్" శ్యామ్ "గ్యాంగ్ వార్"
Older news items:
- 'సారీ..మా ఆయన ఇంట్లో ఉన్నాడు' రెడీ
- చార్మి కాలేజి స్టూడెంట్ గా ‘ఇందు’
- నాగార్జన 'కేడీ' రిలీజ్ డేట్
- డేట్ మార్చుకున్న "లీడర్''?
- వేసవిలో అలరించనున్న రజనీ-ఐష్ ల 'రోబో'






















