యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో 'కంత్రి' చిత్రాన్ని అందించిన మెహర్ రమేష్ దర్శకత్వంలో
మెగా ప్రొడ్యూసర్ సి అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్ తో 'శక్తి' తెరకెక్కుతోంది. 'సంక్రాంతికి 'అదుర్స్'తో హిట్ కొట్టిన ఎన్టీఆర్ రెట్టించిన ఉత్సాహంతో 'శక్తి' చిత్రం షూటింగ్ లో అడుగుపెట్టారు. తాజాగా ఈ చిత్రం ఈ నెల 6 నుంచి రాజస్థాన్ లోని జైపూర్ లో కీలకమైన షెడ్యూల్ ను 300 మంది యూనిట్ సభ్యులతో భారీ ఎత్తున షూటింగ్ జరుపుకోనుంది. 15 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో ఒక పాట, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తామని దర్శకనిర్మాతలు తెలిపారు.ఈ చిత్రం గురించి హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ, అశ్వనీదత్ గారి బ్యానర్ లో మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉందనీ, ఇదొక పవర్ ఫుల్ కథ అనీ చెప్పారు. తన కెరీర్ లోనే ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు జోడిగా అందాల ఖజానా ఇలియానా నటిస్తున్న ఈ చిత్రానికి యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోటప్రసాద్, డి.ఎస్.కన్నన్ రచనా సహకారం, సత్యానంద్ మాటలు, సిరివెన్నెల-రామజోగయ్య శాస్త్రి పాటలు, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- రామ్ చరణ్ తేజ్ ఆస్ట్రేలియా షెడ్యూల్ డిటేల్స్
- రవితేజ ‘డాన్ శీను’ సరసన త్రిష!? శ్రియ !?
- అల్లు అర్జున్ ‘వరుడు’ చివరి పాటకు రెడీ!
- ఆలుమగల బాంధవ్యం
- ప్రభాస్ కి పితృ వియోగం
Older news items:
- పవన్స్ ‘పులి’ భాగ్యనగర సంచారం!
- లతా మంగేష్కర్‌కు అక్కినేని అవార్డు
- రాజా- పదుకునె జంటగా జయకృష్ణ క్రియేషన్స్ చిత్రం
- బ్యాంకాక్‌లో ప్రభాస్, కాజల్‌ల సినిమా షూటింగ్!
- షూటింగ్ పూర్తయిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్

























