తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > స్పాట్ న్యూస్ > రాజా- పదుకునె జంటగా జయకృష్ణ క్రియేషన్స్ చిత్రం



రాజా- పదుకునె జంటగా జయకృష్ణ క్రియేషన్స్ చిత్రం

E-mail Print
User Rating: / 2
PoorBest 
రాజా, సంచిత పదుకునె జంటగా శ్రీనివాస్ బళ్లాపురం దర్శకత్వంలో జయకృష్ణ క్రియేషన్స్ పతాకంపై సి.గోపాల కృష్ణ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాదులో ప్రారంభమైంది. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త రేబాల కిషోర్ కుమార్ రెడ్డి కెమేరా స్విచాన్ చేయగా జెవికె ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ క్లాప్ ఇచ్చారు. రంగారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ... "రెండేళ్ల కిందట హైదరాబాదులో జరిగిన ఒక ఎన్నారై యువకుని ప్రేమకథే ఈ చిత్ర కథాంశం. ప్రస్తుత రోజుల్లో నవలా పఠనం తగ్గిపోయింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు చక్కటి నవల చదువుతున్న అనుభూతిని కలిగిస్తుంది. వెంగి విఠల్ చక్కటి సంగీతాన్ని అందించారు" అన్నారు.

నిర్మాత సి.గోపాలకృష్ణ మాట్లాడుతూ... మూడు షెడ్యూల్స్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తాం. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 16 రోజులపాటు ఏకధాటిగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంటుందని అన్నారు.

ఈ చిత్రంలో రాజ, సంచిత పదుకునెతోపాటు చలపతిరావు, ఏఆర్సీ బాబు, బాలయ్య, సుధ, సన, జెన్నీ, ఉత్తేజ్, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: వేటూరి, వెంగి, సంగీతం: వెంగి- విఠల్, నిర్మాత: సి. గోపాలకృష్ణ, కథ,మాటలు, స్క్రీన్ ప్లే: శ్రీనివాస్ బళ్లాపురం
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను శ్రీ"