తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
Home > స్పాట్ న్యూస్ > బ్యాంకాక్‌లో ప్రభాస్, కాజల్‌‌ల సినిమా షూటింగ్!



బ్యాంకాక్‌లో ప్రభాస్, కాజల్‌‌ల సినిమా షూటింగ్!

E-mail Print
User Rating: / 8
PoorBest 
యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, తొలిప్రేమ కరుణాకరన్ దర్శకత్వంలో, 'ఛత్రపతి' ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది.

ఈ నెల 21 నుంచి స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారథ్యంలో ఓ భారీ ఫైట్‌ని పది రోజుల పాటు చిత్రీకరించనున్నారు. ఈ ఫైట్‌లో ప్రభాస్‌తో ఫారిన్ ఫైటర్స్ పాల్గొంటారు. ఈ చిత్రానికి ఫైట్ హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ అన్నారు.

ఇంకా నిర్మాత మాట్లాడుతూ.. 'ఛత్రపతి' వంటి సూపర్‌హిట్ చిత్రం తర్వాత ప్రభాస్‌తో తమ బేనర్‌లో చేస్తున్న ఈ సినిమాను స్విట్జర్లాండ్‌లో, అరకులో వేసిన భారీ సెట్‌లో, హైదరాబాద్‌లో జరిపిన షెడ్యూల్స్‌తో 70 శాతం షూటింగ్ పూర్తయిందన్నారు.

ప్రభాస్ కెరీర్‌లో డిఫరెంట్ రొమాంటిక్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా రూపొందిస్తున్నాడని నిర్మాత వెల్లడించారు. మార్చిలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్న ఈ సినిమా తమ బ్యానర్‌లో మరో సూపర్‌హిట్ సినిమా నిలుస్తుందని ప్రసాద్ నమ్మకం వ్యక్తం చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో తమిళ హీరో ప్రభు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌ కుమార్, ఫోటోగ్రఫీ: ఆండ్రూస్, ఫైట్స్: పీటర్‌హెయిన్స్, ఎడిటింగ్: కోటగిరి.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 
More articles :

» ప్రభాస్ కి పితృ వియోగం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు పితృవియోగం ఏర్పడింది.

» ఫారిన్ ఫైటర్స్ తో చిక్కుల్లో పడిన ప్రభాస్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ‘తొలిప్రేమ’,‘బాలు’, ‘హ్యాపి’ మరియు ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’,

» రామ్ చరణ్, ప్రభాస్ లతో చంద్రముఖి భర్త!

తమిళ స్టార్ ప్రభు గణేషన్ తాజాగా స్ట్రయిట్ చిత్రాలతో తెలుగులో అడుగుపెడుతున్నారు.

» అరకు సమీపంలో ప్రభాస్ "డార్లింగ్" కోసం భారీసెట్!

బిల్లా, ఏక్‌నిరంజన్ అంటూ ప్రేక్షకులను అలరించిన యూత్ స్టార్ ప్రభాస్ "డార్లింగ్" అంటూ తెరపైకి...

» ఏక్‌నిరంజన్‌

చిత్రం:ఏక్‌నిరంజన్‌

తెలంగాణా వాదులు సినిమాలను అడ్డుకోవడం సమంజసమేనా?
 
Free Telecommunications Trainings

Tarun-Vimala

వరుడు ఫేం "భాను శ్రీ"