మను, శ్వేత, ప్రియారెడ్డి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం రాయలసీమ ఎక్స్‌ప్రెస్.
ప్రసాద్ నక్కుళ్ల దర్శకత్వంలో శ్రీ స్వామీకృప క్రియేషన్స్ బ్యానర్‌పై నాయుడు దివాకర్ చంద్రమణి, కొట్టెం రామలక్ష్మారెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ... ఫ్యాక్షనిజం, కామెడీ రెండు కోణాలుంటాయి. రాయలసీమ ఫ్యాక్షనిజం ఇంకా ఉండిపోవాలా...? ఫ్యాక్షనిజం వల్ల జీవితాలు నాశనం కావాలా...? దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు..? అనేవాటిని ఆవిష్కరించాం. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. త్వరలో విడుదల చేస్తాం అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో తెలంగాణా శకుంతల, వైజాగ్ ప్రసాద్, గీతాసింగ్, మల్లాది రాఘవ, రాంజగన్, బబ్లూ, జూనియర్ రేలంగి, పొట్టి రాంబాబు, అనూ వైష్ణవి తదితరులు నటిస్తున్నారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26














