జగపతిబాబు, ప్రియమణి జంటగా రూపొందుతున్న చిత్రం సాధ్యం.
కుమార్ బ్రదర్స్ సినీ పతాకంపై కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో చివరి షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ చిత్ర విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ... వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సాధ్యం అనే టైటిల్ నూరుశాతం సరిపోతుంది. ఈ నెలాఖరు వరకూ ఏకధాటిగా జరిగే షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుంది. జనవరిలో పాటలు చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆది చిత్రం ఫేం కీర్తిచావ్లా కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషిస్తోందని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ... ఇప్పటివరకూ జగపతిబాబు తన కెరీర్‌లో పోషించనటువంటి వైవిధ్యమైన పాత్రను ఇందులో చేస్తున్నారు. ప్రియమణిది కూడా అభినయానికి ఆస్కారమున్న పాత్ర.
హీరోహీరోయిన్ల పాత్రల ఔచిత్యం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలకు ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. అత్యంత భారీ ఖర్చుతో ఎక్కడా రాజీపడకుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తప్పకుండా చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకముంది అన్నారు.
తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, యుపిరాజు ప్రగతి, మధుమణి, మున్నా, వేణు, సత్తెన్న తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే: మారో పళని, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- పూర్తి అయిన “చేత వెన్నముద్ద”
- నమో వెంకటేశ పై తెలంగాణ ఎఫెక్టు
- పాటతో ప్రారంభమైన “పంచాక్షరి”
- అల్లరి నరేష్..'రాకెట్ సింగ్'?
- వెరైటీ లవ్‌స్టోరీ "తెలియదు" ఆడియో ఆవిష్కరణ
Older news items:
- "మంగళ"గా వస్తోన్న "మంత్ర"..!?
- శాంతారామ్ పురస్కారానికి ఎంపికైన తెలుగు సినిమా
- ప్రస్థానం ఆడియో విడుదల
- యువతను మేల్కొలిపే లీడర్
- సంక్రాంతికి కళవర్ కింగ్






















