ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపియల్)లో మందిరా బేడీ ఇన్నింగ్స్ ముగిసింది.
ఐపియల్ ట్వంటీ 20 మ్యాచ్ ల్లో ఈసారి టీవీలో మందిరా బేడీ వ్యాఖ్యానం ఉండదు. ఐపియల్ - 3 ట్వంటీ 20 ఈ శుక్రవారం ప్రారంభమవుతోంది. మ్యాచ్ లను ప్రసారం చేసే సెట్ మ్యాక్స్ టీవీ చానెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్నేహ రజనీ మందిరా బేడీని తప్పిస్తున్న విషయాన్ని ధ్రువీకరించారు.తాము కొత్త ముఖం కోసం చూస్తున్నామని, అందువల్ల మందిరా బేడీ ఉండదని ఆమె ఒక ఆంగ్ల దినపత్రికతో అన్నారు. తాను మాక్స్ కోసం ఐపియల్ ను హోస్ట్ చేయడం లేదని, అంతకు మించి తానేమీ ప్రస్తుతం మాట్లాడలేనని మందిరా బేడీ అన్నది. మందిరా బేడీ వయస్సు పెరగడమే కొత్త ముఖం కోసం టీవి చానెల్ వెతుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మందిరా బేడీ ప్రేక్షకులను ఆకర్షించే సౌందర్యాన్ని కోల్పోయినట్లు భావిస్తున్నారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
Newer news items:
- ముంబైపై రాయల్స్ విజయం
- ఛార్జర్స్‌కు షాక్ - నైట్‌రైడర్స్ బోణీ
- ఐపీఎల్, టీవీ ఛానెళ్ల మధ్య సయోధ్య
- ఎనిమిదే దక్కింది ప్రపంచకప్ లో నిరాశపరిచిన భారత్
- ఐపియల్ ఏడు వారాలు మించదు: మోడీ
Older news items:
- తాజా ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో చెక్కు చెదరని భారత జట్టు నెం.2 స్థానం
- ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఆడుతా: యువరాజ్ సింగ్
- హాకీ ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా అద్భుత ఆరంభం.
- హాకీ ప్రపంచ కప్తొలి రోజే ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ షాక్
- ప్రపంచకప్ హాకీలో స్పెయిన్ శుభారంభం






















