తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > గతంలోని వార్తలు



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


జీడీపీ 7% కాదు 3% అవుతుంది: మోర్గాన్

E-mail Print
User Rating: / 0
PoorBest 
భారతదేశపు ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది ఎకాయెకిన 3 శాతానికి పడిపోనుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల అధిపతి మోర్గాన్ స్టాన్లీ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రపంచం యావత్తూ మాంద్యంతో తల్లిడిల్లుతున్న నేపధ్యంలో ఆ నీడలు భారత్‌ను పూర్తి స్థాయిలో తాకనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

తన అధ్యయనం ప్రకారం భారతదేశ ఆర్థికాభివృద్ధి మరింత క్షీణిస్తుందని మోర్గాన్ వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భవిష్య ఆర్థిక వృద్ధిరేటుపై తాము జరిపిన అధ్యయనంలో... 2009లో బుల్ రేటు ప్రకారం 5 శాతం ఉంటే.. 2010నాటికి ఇది 7.4శాతానికి చేరుకుంటుందని అంచనా. ఇక బేర్‌ను దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు 2009లో వృద్ధి రేటు 3 శాతంగా ఉంటుందని.. 2010నాటికి అది 4.5శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు.

మొత్తమ్మీద సగటు వృద్ధిరేటు 2009లో 4.3%గానూ, 2010లో 6.1%గాను నమోదవుతుంది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో 9శాతం ఉన్న వృద్ధిరేటు ఆర్థిక మాంద్యం ఫలితంగా 7.1శాతం వద్ద నిలదొక్కుకుంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే మూడో త్రైమాసికంలో(అంటే అక్టోబరు-డిసెంబరు) వృద్ధి రేటును 5.3%గా నమోదై ప్రభుత్వ అంచనాలను తలకిందులు చేసింది.

భారతదేశానికి సంబంధించి వృద్ధిరేటులో హెచ్చుతగ్గులు... ఆర్థిక మాంద్యం, సార్వత్రిక ఎన్నికలు అనే రెండు అంశాలపై ఆధారపడి ఉంటాయని మోర్గాన్ తెలిపారు. ప్రపంచం ఆర్థిక మాంద్యం నుంచి బయటపడినా, మే ఎన్నికలలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల అవకాశాలున్నట్లయితే వృద్ధిరేటు ఆందోళన కలిగించే రీతిలో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఒకవేళ మైనారిటీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినట్లయితే భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండే అవకాశం ఏమాత్రం లేదని ఆయన పెదవి విరిచారు.
Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!