దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యాన్ని ప్రకటిస్తామా వద్దా అని ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కవేస్తోంది. కాని ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి చాలా గందరగోళంగావుంది. సోమవారం(నిన్నటికి నిన్న) యూరోప్, అమెరికాలోని కొన్ని కంపెనీలు దాదాపు 67వేల మంది ఉద్యోగస్తులను తొలగించింది.
మన భారత దేశంలో కూడా ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇందులో ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ(టెక్స్‌టైల్ సెక్టార్). గడచిన 45రోజులలో ఈ పరిశ్రమనుంచి దేశవ్యాప్తంగా 5 లక్షలమంది ఉద్యోగస్తులు వీధిన పడ్డారు. భారతదేశ ఆర్థిక శాఖా కార్యదర్శి కూడా దీనిని ఉదహరించారు.
ఇదే పరిశ్రమలో రాబోయే రెండు నెలల్లో దాదాపు మరో 5 లక్షలమంది ఉద్యోగస్తులు వీధిన పడనున్నారు. అంటే దాదాపు 10 లక్షలమంది ఉద్యోగులు రోడ్డున పడనున్నారు.
సెజ్‌లకు సంబంధించి నిరుడు 30 వేల ఉద్యోగాలు ఊడిపోయాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఇదే పరిస్థితి. ఎన్నో పెద్దపెద్ద డెవలపర్స్ కంపెనీలుకూడా తమ ప్రాజెక్టులను మధ్యలోనే నిలిపివేసిన సందర్భాలున్నాయి.
ఈ కంపెనీలపై ఆర్థిక మాంద్యప్రభావమేనని స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఎన్నో ప్రైవేట్ సెక్టార్లలో ఆర్థికమాంద్యంవలననే ఎంతోమంది ఉద్యోగస్తులను ఇంటికి పంపేసిన సందర్భాలు కోకొల్లలని విశ్లేషకులు పేర్కొన్నారు.
కాగా పరిస్థితి ఇలాగే కొనసాగితే రోబోయే రెండు నెలల్లో 1 కోటి మంది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలను కోల్పోనున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
| Comments |
|
Powered by !JoomlaComment 3.26



















