తెలుగు నౌ !

ఇప్పుడు అంతా తెలుగులోనే...!!

  • Increase font size
  • Default font size
  • Decrease font size
,
Home > ఏ సినిమా ఎలావుంది? > కళవర్‌ కింగ్‌



మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా


కళవర్‌ కింగ్‌

E-mail Print
User Rating: / 17
PoorBest 

చిత్రం: కళవర్‌ కింగ్‌

సంస్థ: సాయికృష్ణ ప్రొడక్షన్స్‌
నటీనటులు: నిఖిల్‌, శ్వేతబసు ప్రసాద్‌, అజయ్‌, ఆహుతి ప్రసాద్‌, విశ్వనాథ్‌ కాశీ, రఘుబాబు, వేణుమాధవ్‌, అనిత తదితరులు.
నిర్మాతలు: దమ్మాలపాటి శ్రీనివాసరావు, ఎమ్‌.చంద్రశేఖర్‌.
దర్శకత్వం: ఎల్‌.సురేష్‌

 


TeluguNow.com Rating: 2.5 /5
Release Date: 26 ఫిబ్రవరి 2010

కథ:రాజమండ్రి సమీపంలోని ఓ గ్రామంలో రాజేష్ (నిఖిల్) అనే యువకుడు ఉంటాడు. అతనికి ఊరినిండా అప్పులే.. అతనిలో ఉన్న మిమిక్రీ చేసే టాలెంట్ తో ఆ అప్పుల వారందరినీ మోసంచేస్తూ కొత్త అప్పులు ఎలా చేయాలో ఆలోచిస్తూ గడుపుతుంటాడు. ఆ ఊళ్ళో నరేంద్రశెట్టి (అజయ్) వడ్డీ వ్యాపారం చేసుకునే ఓ రౌడీ. అతని భార్యని చంపేస్తాడు. అతని భార్య చెల్లెలు అయిన శృతి (శ్వేతా బసు ప్రసాద్)ని పెళ్ళి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు. నరేంద్ర శెట్టితో పెళ్ళి ఏమాత్రం ఇష్టం ఉండదు శృతికి. అనుకోకుండా రాజేష్ తో శృతికి పరిచయం ఏర్పడుతుంది. నరేంద్రశెట్టి ద్వారా శృతి ఇబ్బందులు పడుతుందని తెలుసుకున్న రాజేష్ శృతిని రక్షించడానికి పూనుకుంటాడు. కరుడు కట్టిన రాక్షసుడయిన నరేంద్రశెట్టి బారి నుండి శృతిని రాజేష్ కాపాడాడా లేదా అన్నదే మిగతా కథ.

కథ మొత్తం ఓ పల్లెటూర్లోనే సాగిపోతుంది. దర్శకుడు సురేష్ కథని బాగానే డీల్ చేసాడు. అలాగే వేణుమాధవ్, ఆలీలతో కామెడీని కూడా బాగానే పండించగలిగాడు. ఫస్టాఫ్ అంతా సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ కి వచ్చే సరికి కథ పట్టుబిగించడంతో పాటు ఆలీ కామెడీ ప్రేక్షకులని కట్టిపడేస్తాయి.

నటన :-
నిఖిల్ సిద్దార్థ :- నిఖిల్ సిద్దార్థ తన రొటీన్ నటననే కనబరిచాడు. డైలాగులు ఫాస్ట్ గా చెప్పేయడంతో అక్కడక్కడా అతను చెప్పే డైలాగులు అర్థం కావు. అదొక్కటి తప్పితే నటన పరంగా, డాన్స్ పరంగా ఓకే.
శ్వేతాబసు ప్రసాద్:- హీరోయిన్ శ్వేతాబసుప్రసాద్ నటన బావుంది. అయితే కాస్త లావుగా కనిపించడం మైనస్ పాయింట్.
అజయ్:- అజయ్ కి ఇలాంటి క్యారెక్టర్ లు కొత్తేమీ కాదు. తన పాత్రకి తగ్గట్టుగా బాగా చేశాడు. ముఖ్యంగా ఆలీ, అజయ్ ల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి.    
వేణుమాధవ్:- వేణుమాధవ్ గురించి చెప్పేదేముంది..? తనదైన శైలిలో కామెడీని చక్కగా పండించాడు.
ఆలీ:- విలన్ అజయ్ ని బురడీ కొట్టించడానికి ఆలీ వేసుకునే 'ఇసాంబుల్ అవుల్ జవుల్ పకీర్' వేషం, ఆ వేషంలో ఆలీ చేసే కామెడీ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం:- బ్యాంకు మేనేజర్ పాత్రలో ధర్మవరపు తనదైన శైలిలో కామెడీని పండించారు.    
రఘుబాబు విలన్ పక్కనే ఉండే క్యారెక్టర్ రఘుబాబుది. ఓ కాలేజి స్టూడెంటు ప్రేమలో పడిపోయే సన్నివేశాలని చాలా బాగా చేశాడు. అతని కామెడీ బావుంది.

మిగతా నటీనటులు కూడా తమ తమ పాత్రలకి తగ్గట్టుగా నటించారు.

టెక్నికల్ డిపార్ట్ మెంట్..
సంగీతం:- సంగీతం యావరేజ్ గా ఉంది.
మాటలు:- అక్కడక్కడా బావున్నాయి. ముఖ్యంగా ధర్మవరపు, నిఖిల్ తో 'యాక్టింగ్ లో ఎన్టీఆర్, రాజకీయాల్లో రాజశేఖరరెడ్డి, అప్పుల్లో నిన్ను మించిన వాడు ఈ ప్రపంచంలోనే లేడు' అనే డైలాగ్ మరియు ఆలీ 'ఈ బూడిదతో ఎంతో ప్రేమికులని కలిపాను' అంటే దానికి రఘుబాబు 'బూడిదతో కలిపావా..? బూడిదలో కలిపావా..?' అనే డైలాగులు ఆకట్టుకుంటాయి.
పాటలు:- భాస్కరభట్ల, వనమాలి, కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం బావుంది.
మిగతా డిపార్ట్ మెంట్ వర్క్ కూడా ఫర్వాలేదు.
సరదాగా నవ్వుకోవడానికి ఈ చిత్రం చూడొచ్చు.

 

Comments
Add New Search RSS
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
UBBCode:
[b] [i] [u] [url] [quote] [code] [img] 
 
 
:angry::0:confused::cheer:B):evil::silly::dry::lol::kiss::D:pinch:
:(:shock::X:side::):P:unsure::woohoo::huh::whistle:;):s
:!::?::idea::arrow:
 
Please input the anti-spam code that you can read in the image.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 
బాబ్లీ సందర్శన కోసం వెళ్ళిన తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయడం సబబేనా!
 
Free Telecommunications Trainings
మీరు పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారా
HAPPY FRIENDSHIP DAY !!!

Latest Movie Reviews

తాప్సి ను చూశారా!

ఎవరు చూస్తున్నారు ?!

We have 125 guests online

ప్రకటనలు

తెలుగునౌ.కాం లో ప్రకటనల కోసం సంప్రదించండి:+91 9014466169
admin(@)telugunow.com .......................................

ఆడియో రిలీజ్ న్యూస్

 

రజని రోబో ఆడియో డౌన్లోడ్

రజని ...

 

మా ఊరి మహర్షి (2010) ఆడియో డౌన్లోడ్

...

 

మా అన్నయ్య బంగారం (2010) ఆడియో డౌన్లోడ్

మా అన...

 

పెరియార్ రామస్వామి నాయకర్ (2010) ఆడియో డౌన్లోడ్

పెరి...

బాల ప్రపంచం

చాలా హాట్ గురూ


పత్రికలు డౌన్లోడ్ చేసుకోండి!

Special Galleries